అమరావతి, (జనస్వరం) : ప్రజలు గౌరవప్రదంగా జీవించడం ఈ ప్రభుత్వానికి నచ్చదు. చెత్త పన్ను విధింపే ఒక దరిద్రం అనుకొంటే వసూలు చేస్తున్న విధానం మరింత దిగజారుడుగా ఉంది. కర్నూలులో వ్యాపారులు ఆ పన్ను చెల్లించలేదని దుకాణాల ముందు- సిటీలోని చెత్తను తెచ్చి వేసి అవమానిస్తారా? ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే! ప్రజల మంచి కోరి పరిపాలన చేస్తున్నట్లు ఏ కోశానా కనిపించడం లేదు. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ట్రాక్టర్లు వేసుకొని తిరగడం ఏం సూచిస్తోంది? డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకొనేవాళ్ళ ఆలోచనలా ఉంది అని పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ ద్వారా తెలిపారు.