రాజంపేట, (జనస్వరం) : కడప జిల్లాలో అన్ని అర్హతలు ఉన్నా రాజంపేట పార్లమెంట్ కేంద్రంగా ఉండి కూడా రాజంపేటను కాదని కొండ ప్రాంతాల్లో ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామంటే ఒక సామాన్యుడిలా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తూ పోలీసులలో అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు అంటే మనం ఏం సాధించాం? ఐదువేలకు పైగా అభ్యంతరాలను కలెక్టర్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రికి, సంబంధిత శాఖలకు తెలియజేయడమే కాకుండా పోస్టుకార్డుల ఉద్యమం, డిజిటల్ క్యాంపెయిన్, వినూత్న రీతిలో అనేకరకాలుగా ప్రభుత్వానికి నిరసన తెలిపిన ఎలాంటి చలనం లేకపోగా రాయచోటిలో జిల్లా కేంద్రం ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారు. అంటే రాజంపేట ప్రజలు చేతకాని వారని ప్రభుత్వం భావిస్తున్నట్లు అనిపిస్తుంది. ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్, మునిసిపల్ చైర్మన్, ఎమ్మార్వో, ఎస్ ఐ, డి ఎస్ పి ఇలా అందరినీ ఒకే సామాజిక వర్గం వారిని తీసుకొని ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం తలోగ్గని పక్షంలో కోర్టులను ఆశ్రయించే ఈ ఉద్యమాన్ని మిగతా పార్టీలతో, కుల సంఘాలతో, విద్యార్థి సంఘాలతో కలిసి జనసేన పార్టీ తరఫున ప్రభుత్వం ఊహించని స్థాయికి తీసుకెళ్లి రాజంపేటను ఎలాగైనా జిల్లాగా ఏర్పాటయ్యే వరకు పోరాడుతామని జనసేన పార్టీ నాయకులు బాలసాయి కృష్ణ తెలిపారు. పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా రాజకీయ నాయకులలో చిత్తశుద్ధి, నీతి నిజాయితీ, రాజకీయ విలువలు మరియు నేటి తరానికి ధైర్య సాహసాలను ప్రసాదించాలని పొట్టి శ్రీరాములు గారిని ప్రార్థిస్తున్నామని తెలిపారు.