రాజంపేట, (జనస్వరం) : భారత్ టుడే న్యూస్ ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేస్తున్న రమణయ్య రాపూరు చెక్ పోస్ట్ దగ్గర కొందరు ఆకతాయిలు తాగి బైక్ డ్రైవ్ చేసి రమణ గారిని ఆక్సిడెంట్ చేయడం జరిగింది. దాని వల్ల అతని కాలు విరిగి కోమాలోకి వెళ్లడం జరిగి, 5 లక్షల పైగా ఖర్చుపెట్టినా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. జనసేన పార్టీ రాజంపేట తరఫున 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫోర్త్ ఎస్టేట్ గా సమాజం కోసం పనిచేసే మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇవ్వాలని అలాగే కార్డు వెయ్యి రూపాయలు పైన వైద్య ఖర్చులు అయితే ఆరోగ్యశ్రీ ద్వారా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు అనేక రకాల నియమ నిబంధనలు చెప్పి అలాగే కొన్ని హాస్పిటల్స్ లో మాత్రమే వాటికి వర్తిస్తుంది అని చెప్పడం సరైన విధానం కాదని అన్నారు. యాక్సిడెంట్ అయిన వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో దగ్గరలో ఉన్న మంచి హాస్పిటల్ కి చికిత్స వెళితే అది ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వదు అని చెప్పడంతో లక్షల లక్షల రూపాయల ఆర్థిక భారం సామాన్య ప్రజల మీద పడుతుంది. కనీస అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ అన్ని హాస్పిటల్లో వర్తించే విధానాన్ని తీసుకురావాలని ఎలాంటి చికిత్స అయినా ప్రభుత్వం భరించే విధంగా తయారు చేయాలని అంతేకాకుండా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడేళ్ల క్రితం మొదలైన ట్రామా కేర్ సెంటర్ ఇంకా ప్రజలకు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని దానిని యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని జనసేన పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ జనసేన పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందజేసిన ఎన్నారై జనసైనికులు ప్రవీణ్ ముప్పల, ప్రశాంత్ భారతాల, సాయి శ్రీనివాస్ ఇడిమడకల, బాలసాయికృష్ణ, అన్నమయ్య జిల్లా సాధన సమితి సభ్యులు శివప్రసాద్ నాగినేని గారికి జనసేన పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు బాల సాయి కృష్ణ, ప్రశాంత్ భారతాల, గోపి కృష్ణ చెంగలగారి , తాళ్లపాక శంకరయ్య మరియు యు పుల్లంపేట జనసైనికులు మహేష్ అవసాని తదితరులు పాల్గొన్నారు.