బనగానపల్లె, (జనస్వరం) : మార్చి 14 సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం దగ్గర జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని బనగానపల్లె జనసేన పార్టీ నాయకులు భాస్కర్ అన్నారు. ఈ సభకు జనసేన పార్టీ కార్యకర్తలు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు మద్యపాన నిషేధం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, సిపిఎస్ రద్దు, అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయల పింఛన్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా పెంచుతాము అని చెప్పి మూడు సంవత్సరాల్లో కేవలం 500 రూపాయలు ఇవ్వడం, ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు మరియు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజా సమస్యలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రభుత్వాన్ని ప్రశ్నించపోతున్నారని రాష్ట్ర ప్రజలు మార్పు దిశగా అడుగులు వేస్తున్నారని ఈ సభతో సరికొత్త రాజకీయ మార్పు జరగబోతోందని ఈ బహిరంగ సభకు జనసేన పార్టీ కార్యకర్తలు ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్రప్ప, ఓబులేసు, పృథ్వి, విక్రమ్, అజిత్ రెడ్డి, కాసిం, శివరామిరెడ్డి, జనార్ధన్, రాము పాల్గొన్నారు.