గుంటూరు, (జనస్వరం) : మార్చి 14వ తేదిన మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామం నందు జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య అన్నారు. ఈరోజు పెదనందిపాడు మండలంలో జనసేన నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నేడు సామాన్యుడి సగటు జీవితం ఆందోళనగా వున్నది. ఇంటి పన్ను, తడిచెత్త, పోడిచెత్త, విద్యుత్, పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని అన్నారు. జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్ మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో ఎలాంటి సమస్యలపైన అయిన స్పందించే ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమే అన్నారు. రేపు సభకు జనసైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు అధికసంఖ్యలో తరలిరావాలని డేగల లక్ష్మణ్ అన్నారు. జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాధ్ మాట్లాడుతూ పార్టీ క్రియాశీలక సభ్యాత్వాలు ఎక్కువ సంఖ్యలో మన ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి చేయటం సంతోషంగా వుందని అన్నారు. అదే స్పూర్తితో రేపు జరగబోయే ఆవిర్భావ దినోత్సవ సభను జయప్రదం చేయాలని అందుకు మనం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అయిదు మండలాల నుంచి భారీగా కార్యకర్తలు, జనసైనికులు తరలి రావాలని త్రీనాధ్ అన్నారు. పెదనందిపాడు మండలం జనసేన పార్టి అధ్యక్షులు కోల్లా లీలా గోపినాథ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేన పార్టిని బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. నూతనంగా పార్టీ కార్యక్రమాల కమిటి సభ్యునిగా నియమితులైన యడ్ల వెంకటేశ్వరరావును జనసేన నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు యడ్ల వెంకటేశ్వరరావు, గుంటూరు రూరల్ మండల కార్యదర్శులు ముళ్ళపూడి చిన్న వెంకటేశ్వరరావు, తోటవెంకటేష్, పెదనందిపాడు మండల ప్రధాన కార్యదర్శి నూనె శ్రీనివాసరావు, జనసేన పార్టీ వరగాని, గ్రామ అధ్యక్షులు ఒబ్బినేని శ్రీను, నూనె పవన్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.