ఖమ్మం, (జనస్వరం) : రెక్కాడితే కానీ డొక్కాడని ఒక నిరుపేద మహిళ భర్త చనిపోవడంతో కూలి పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తుంది. సరైన ఇల్లు కూడా లేకపోవడంతో చిన్న పాకను వేసుకొని నివాసముంటుంది. ఈ క్రమంలోనే రోజు మాదిరిగా కూలి పనులకు వెళ్ళింది. ప్రమాదవశాత్తు మధ్యాహ్న సమయంలో ఇంటికి నిప్పు అంటుకొని స్థానికులు వచ్చేసరికి పూరి గుడిసె పూర్తిగా దగ్ధమై పోయింది. కూలి నాలి చేసుకుంటూ రూపాయి కూడా పెట్టుకున్న డబ్బులు, వంట సామాగ్రి, బట్టలు పూర్తిగా దగ్ధమై కట్టుబట్టలతో మిగిలింది. గ్రామస్తులు ఆపదలో ఆదుకునే ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన యువజన అధ్యక్షులు డేగల రామచంద్ర రావుకు తెలియజేశారు. స్పందించిన రామచంద్ర రావు జనసేన సభ్యులను వెంట తీసుకొని అశ్వారావుపేట మండలం పిచుకుల పాడు అగ్ని ప్రమాద బాధితులు ఇంటికి వెళ్లి ప్రమాదం జరిగిన వివరాలు తెలుసుకొని బాధితురాలి ధైర్యం చెప్పి ఐదు వేల రూపాయల నగదును ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు నాగబాబు, భాస్కర్, అయ్యప్ప, కుమారస్వామి స్థానిక టిఆర్ఎస్ నాయకులు నిర్మల పుల్లారావు, పసుపులేటి రామారావు పాల్గొన్నారు.