
విజయనగరం ( జనస్వరం ) : విజయనగరం నియోజకవర్గం మేయర్ వెంపడం లక్ష్మీ కార్పొరేటర్ గా గెలిచిన 11వ డివిజన్ లో గత మూడు నెలలుగా స్వర్ణ రకం మధ్యస్త సన్న బియ్యం పంపిణీ చేసే వెహికల్ ప్రజల ఇంటి వద్దకు రాకుండా రేషన్ డిపో లోనే బియ్యం ఇతర సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించిన విజయనగరం జిల్లా జనసేన నాయకులు కార్పొరేటర్ అభ్యర్థి హుసేన్ ఖాన్ అధికారులతో మాట్లాడి రేషన్ వాహనాన్ని ప్రజల వద్దకే వచ్చేలా చేయడం జరిగింది. గెలిచిన నాయకులు తమ కోసం పని చేయకపోయినా ఓడిపోయిన జనసేన పార్టీ నాయకులు మాత్రం ప్రజల కోసం పోరాటం చేయడం చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.