కదిరి, (జనస్వరం) : 2020 సంవత్సరంలో ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ విధానంలో చెక్ పోస్టుల్లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా దాదాపు నాలుగు వేల మంది వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వారికి 15 వేల రూపాయలు నెల నెల జీతం ఇచ్చేలాగా, వారు చెక్ పోస్టులలో మద్యం, ఇసుక, ఎర్రచందనం, గుట్కా ఇలాంటివి అక్రమ రవాణా జరగకుండా నిరోధించడానికి వారిని ఎంపిక చేయడం జరిగింది. కానీ వారికి ప్రభుత్వం గత 11 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. దానివలన వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున ప్రభుత్వం వెంటనే వారికి జీతాలు ఇవ్వాల్సిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో ఈ సమస్యను మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని కదిరి జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.