జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వం అందరు నమోదు చేసుకోవాలి : మండపేట నియోజకవర్గ ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ

     మండపేట, (జనస్వరం) : సమాజంలో నవ చైతన్యం, మార్పు తెచ్చే దిశగా భవిష్యత్లో జనసేన పార్టీ ఉప్పెనలా ఎగసిపడుతుందని మండపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పేర్కొన్నారు. ఈ నెల 7తో పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు గడువు ముగుస్తుందని ఆయన అన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి అండగా నిలిచే సత్తా ఒక్క జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఈ నెల 7 న పార్టీ సభ్యత్వాల నమోదు గడువు ముగుస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు, పవన్ అభిమానులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్న వారిలో ఎవరైనా దురదృష్టవశాత్తు ప్రమాదాలలో మృతి చెందితే పార్టీ తరుపున వారికి రూ 5 లక్షల సహాయం అందిస్తారని పేర్కొన్నారు. ఒకవేళ ప్రమాదాలలో ఎవరైనా గాయపడితే రూ 50 వేల రూపాయల వరకు ఆర్ధిక సహాయం అందుతుందన్నారు. ఇప్పటికే పలువురు జనసైనికులకు ఇదే విధంగా పలు ఆర్ధిక సహాయలు అందయన్నారు. 18 సంవత్సరాలు నుండి 70 ఏళ్ళ లోపు వయస్సు వారంతా ఈ సభ్యత్వ నమోదు పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. మండపేట నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం పూర్తి వివరాలకు 9441857117 నెంబర్ కు ఫోన్ చేసి సంప్రదించాలని ఆయన కోరారు.

See also  బైరిపురం గ్రామంలో గడప గడపకు జనసేన కార్యక్రమం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి