
మండపేట, (జనస్వరం) : జనసేనపార్టీని నమ్ముకున్న వారికి అండగా నిలిచే సత్తా ఒక్క జనసేనాని పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉందని మండపేట నియోజకవర్గం, రాయవరం మండలం, చెల్లూరు MPTC-1 గొల్లపల్లి అనురాధ అన్నారు. ఈ నెల 7వ తారీఖుతో పార్టీ సభ్యత్వాల నమోదు గడువు ముగుస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు, పవన్ అభిమానులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆమె స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్న వారిలో ఎవరైనా దురదృష్టవశాత్తు ప్రమాదాలలో మృతి చెందితే పార్టీ తరుపున వారికి 5 లక్షల రూపాయల సహాయం అందించడం జరుగుతుందన్నారు. అదే విధంగా ప్రమాదాలలో ఎవరైనా గాయపడితే 50 వేల రూపాయల వరకు ఆర్ధిక సహాయం అందుతుందన్నారు. ఇప్పటికే పలువురు జనసైనికులకు ఇదే విధంగా పలు ఆర్ధిక సహాయలు అందించడం జరిగిందన్నారు. 18 సంవత్సరాలు నుండి 70 ఏళ్ళ లోపు వయస్సు వారంతా ఈ సభ్యత్వ నమోదు పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9849208813, 99631 01055, నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని అనురాధ కోరారు.