విశాఖపట్నం ( జనస్వరం ) : ఆంధ్రా యూనివర్శిటిలో అవక తవకలకు పాల్పడిన వైస్ ఛాన్స్ లర్ ఆచార్య పీ.వీ.జి డి ప్రసాద రెడ్డిని తక్షణమే భర్తరఫ్ చేయాలన్న అఖిల పక్షాల పిలుపుకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది. మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం వద్ద నుండి ఆంధ్ర విశ్వ విద్యాలయం గేటులో నుండి అధిక సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు చొచ్చుకుని వెళ్లారు. పోలీసులు వెంబడించిన పట్టువదలక ముట్టడికి పూనుకున్నారు. తదుపరి పోలీసులు వారిని అరెస్టు చేసి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ కు పంపడం జరిగింది. వారిలో బొడ్డేపల్లీ రఘు, వన్నెంరెడ్డి సతీష్ కుమార్, శివ ప్రసాద్ రెడ్డి, ముగి శ్రీనివాస్, దర్మేంద్ర, తెలుగు అర్జున్, ప్రసాద్, కొండలరావు గారు, కిరణ్ ప్రసాద్, కళ, త్రివేణి, యజ్ఞశ్రీ, దుర్గ, అనురాధ, రాజేశ్వరి, లక్ష్మి, పార్వతి, తెలుగు లక్ష్మి, నాగ లక్ష్మి, లక్ష్మణ్, గణేష్, హరి, నూకరాజు తదితరులు ఉన్నారు. జనసేన నాయకులు మాట్లాడుతూ చాలాచోట్ల పోలీసులు అరెస్టు చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్, ఎంవిపి కాలనీ పోలీస్ స్టేషన్, ఇతర పోలీస్ స్టేషన్ లో అరెస్టులను మేం ఖండిస్తున్నామన్నారు. పీ.వీ .జి డి ప్రసాద రెడ్డి దురాగతాలలో వీటిపై మన గళం అని అన్నారు. విశాఖకు చీఫ్ మినిస్టర్ లా వ్యవహరిస్తున్న వైస్ ఛాన్స్ లర్ ఆచార్య పీ.వీ.జి డి ప్రసాద్ రెడ్డి గారి అవకతవకలపై తక్షణం చర్యలు తీసుకుని గవర్నర్ జోక్యం చేసుకుని భర్త్ రఫ్ చేయాలన్నారు. ప్రసాద్ రెడ్డి వైసీపీ తొత్తుల కాకుండా ఒక వీసీగా వ్యవహారించాలి అని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఛలో ఆంధ్ర యూనివర్సిటీ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వం నిరంకుశంగా జనసేనపార్టీ నాయకులు, వీర మహిళలు కార్యకర్తలను ముందస్తుగా పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయించడం పిరికిపందల చర్య అని అన్నారు. మేం ప్రజాస్వామ్యబద్ధంగా, మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో పోరాడుతున్న జనసైనికులపై అమానుషంగా ప్రవర్తించిన ప్రభుత్వ తీరు హేయమైన చర్యను మేము ఖండిస్తున్నామన్నారు. ఆంధ్రాయూనివర్సిటీ వి.సి ప్రసాద్ రెడ్డి పాలనాపరమైన చర్యలు తీసుకుని రీకాల్ చేసే వరకు మా పోరాటం ఆగదని అన్నారు. ఈ పోరాటంలో అరెస్టు అయిన జనసేన సైనికులకు, వీర మహిళలకు పోలీస్ స్టేషన్స్ వద్దకు వచ్చి మద్దతుగా నిలిచిన శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.