● ప్రమాదపు అంచుల్లో తరగతులు ప్రమాదం పొంచి ఉన్న బొండగుడా పాఠశాల
● ప్రమాదంలో విద్యార్థుల విద్యాబోధన, కిందకి పడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
● జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు, వర్కింగ్ కమిటీ సభ్యులు కొనెడి లక్ష్మణరావు, చినబాబు, సంతోష్ కుమార్ విద్యాశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం.
అరకు, (జనస్వరం) : అరకు నియోజకవర్గం అరకు వేలి మండలం బస్కీ పంచాయితీ బోండాగూడ గ్రామంలో జనసేనపార్టీ నాయకులు పర్యటించారు. రోడ్డు పక్కనే ఉన్న పాఠశాల చూసి అధికారులుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు కూర్చొని చదువుకోవడానికి సరైన స్థలం కూడా లేదు. ప్రమాదపు అంచుల్లో పిల్లలు తరగతులు నిర్వహించడం సరికాదని అన్నారు. పిల్లలు కిందకి పడితే చాలా ప్రమాదం జరుగుతుందని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అధికారులుపై మండిపడ్డారు. పైగా వర్షాకాలం వస్తే పూర్తిగా సెలవులు ప్రకటించి పిల్లలను ఇంటికే పరిమితం చేస్తారని అన్నారు. ITDA PO స్పందించి వెంటనే నూతన పాఠశాల భవనం మంజూరు చేయాలి అని జనసేనపార్టీ నాయకులు ఈ సందర్భముగా అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు.