మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి జిల్లా కావాలని మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో మదనపల్లెలో గత 25 రోజులుగా జరుగుతున్న నిరసన కార్యక్రమం తెలిసిందే. ఈ కార్యక్రమాలకు జనసేన తరపున మద్దతుగా చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత పాల్గొంతున్నారు. ఆమె మాట్లాడుతూ మదనపల్లిని జిల్లాకు తగ్గ అర్హతలు ఉన్నాయని, మదనపల్లిని నియోజకవర్గంలోని చుట్టుపక్కల గ్రామాల రైతులకు, పట్టణ ప్రజలు, లాయర్లు, ఆటో సంఘాలు, టైలర్లు, వర్తకులు కూడా పోరాడుతున్నారన్నారు. ఈ విధంగా 4 నియోజకవర్గాల్లో మదనపల్లి జిల్లా చేయాలి అని నిరసనలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు చేస్తున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ టాగూర్ బెంగాలీ నుంచి ఆంగ్ల భాషలోకి అనువాదం చేసి జాతీయ గీతానికి లయ కట్టిన ప్రదేశాన్ని ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. అన్ని మౌలిక సదుపాయాలు కలిగి ఉన్న మదనపల్లి చుట్టుపక్కల వున్న తంబళ్లపల్లె నియోజకవర్గం, పీలేరు, పుంగనూరు నియోజకవర్గం వారికి చేరువలో ఉంది కాబట్టి పాలకులు ప్రజలకు అనుకూలంగా వున్న మదనపల్లిని జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. అన్నివిధాలుగా ఎల్లప్పుడూ అనుకూలంగా వాతావరణం వున్న మదనపల్లె జిల్లాకు సరైన ప్రదేశం అని అన్నారు. మదనపల్లి నియోజకవర్గం ప్రజల దైవం అయిన ctm నలవీర గంగా భవాని అమ్మను తమ మొర ఆలకించి ప్రభుత్వ మనసు మార్చి మదనపల్లి జిల్లాను చేయాలి అని మదనపల్లి జిల్లా సాధన JAC సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు నాయకులు పాల్గొన్నారు.