Search
Close this search box.
Search
Close this search box.

ప్రకాశరావు గారి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది : దుద్దేకుంట వెంకటేశ్వర రెడ్డి

     అనంతపురం ( జనస్వరం ) : డాక్టర్ ఆశావాది ప్రకాశరావు గారు అధ్యాపకులుగా, సాహితీవేత్తగా అవధానిగా తెలుగు వారందరికీ సుపరిచితులు సమాజాన్ని చైతన్యవంతం చేయటంలో భాగంగా వారు అనేక రచనలు చేశారని బీజేపీ అధికార ప్రతినిధి దుద్దేకుంట వెంకటేశ్వర రెడ్డి పత్రికాముఖంగా తెలియజేసారు. ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు హిందూ ధర్మం పట్ల వారికున్న అభిప్రాయాన్ని అధ్యయనం చేశారు. హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని దురాచారాలను వారి ఎత్తి చూపుతూనే దళితులు నిమ్న వర్గాల వారు మత మార్పిడులకు ప్రలోభాలకు గురికాకుండా వారిని చైతన్య పరిచారు. వారితో నాకు వ్యక్తిగతంగా ప్రబంధము ఉంది. వారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించినప్పుడు వారి స్వగృహానికి వెళ్ళి ఘనంగా సన్మానించడం జరిగింది. అప్పుడు వారు అన్న ఇటువంటి మాటలు ఈరోజు నాకు గుర్తున్నాయి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు సామాన్యులకు అట్టడుగు వర్గాల వారికి పద్మ అవార్డులు ఇవ్వడమనేది గొప్ప విషయంగా వారు చెప్పారు. వారు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క విభాగమైన “సమరసత సేవా” కు ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యక్షులుగా సేవలందించారు. సాహితీరంగంలో చేసిన విశేష కృషి వలన తెలుగు రాష్ట్రాలలో అనేకమంది అభిమానులను సంపాదించుకోగలిగారు. వారు పద్మశ్రీ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకున్న సందర్భంగా వారిని సన్మానించడం జరిగింది. ఆశావాది ప్రకాష్ రావు గారి వంటి ఉన్నత విలువలు కలిగిన సాహితీ వేత్తను కోల్పోవడం సాహితీలోకానికి తీరని లోటు. వారు ఈ భూమిమీద లేనప్పటికీ రచించిన రచనలు నేడు తెలుగు వారందరికీ అందుబాటులో ఉంటాయి. మరొక్కసారి శ్రీ ఆశావాది ప్రకాశరావు గారికి సద్గతులు కలగాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఘన నివాళి అర్పిస్తున్నాని తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20240125-WA0011
మదనపల్లి జనసేనపార్టీ ఆధ్వర్యంలో భారీగా చేరికలు
IMG-20240108-WA0010
నెల్లూరు నగరంలో హోరెత్తిన జనసేన జెండా
నెల్లూరు
నెల్లూరు సిటీలో జనసేన జెండా ఆవిష్కరణ 
Varahi Updates
Varahi Updates : How to improve 5 best Knowlwdge sites
IMG-20230904-WA0042
జనసేన కెనడా ఐటి టీమ్ ఆధ్వర్యంలో వీడియో ఎడిటింగ్ కోర్సు ప్రారంభం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way