ఛలో నరసాపురం గోడపత్రికలను ఆవిష్కరించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు

  విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖ పశ్చిమ నియోజకవర్గం ముప్పిన ధర్మేంద్ర గారి ఆధ్వర్యంలో శ్రీహరిపురం మార్కెట్ లో ఉన్న చేపలు అమ్ముతూ జీవనోపాధి సాగిస్తున్న వారితో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 20 వ తేదిన చేపట్టే ఛలో నరసాపురం మత్స్యకార అభ్యున్నత సభ కి సంబంధించి గోడ పత్రికలను విడుదల చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ నాయకులు పీలా రామకృష్ణ, జనసేన శ్రేణులు శ్రీకాంత్, శివ, నగేష్, తులసి, లక్ష్మణ్, రాజేష్, వినయ్, సాయి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

See also  ఇసుక అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు