
అరకు, (జనస్వరం) : జనగణను పూర్తి అయ్యేవరకు గ్రామ, పట్టణ నియోజకవర్గాల భౌగోళిక హద్దులు మార్పుపై కేంద్ర ప్రభుత్వం జనవరిలో విధించిన నిషేధం మన రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించాదా? అని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది. భౌగోళిక, ఆర్ధిక, సామాజిక పరిస్థితులను అంచనా వేసి ఒక శాస్త్రీయ పద్ధతిలో ఎక్కడైనా జిల్లాను ప్రకటిస్తారు. ఇలాంటి విరుద్ధ ప్రకటన ఎక్కడ చూడలేదని అన్నారు. ప్రభుత్వం ఇంత హడావుడిగా జిల్లాలు ప్రకటన చేసిన జనగణన పూర్తయ్యాక పార్లమెంట్ నియోజకవర్గాల భౌగోళిక మార్పులుంటాయి. పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్యకుడా పెరుగుతుంది. ఏపీలో ఎమ్మెల్యేలు స్థానాల సంఖ్య 175 నుంచి 225కు పెరుగుతుంది. ఇప్పుడున్న పార్లమెంట్ నియోజకవర్గాలు అప్పుడుండవు. అప్పుడు మళ్ళీ జిల్లాలు పునిర్విభజన చేస్తారా? జిల్లాల పునిర్విభజన చట్టలు కేంద్ర పరిధిలోవి ఎలా జిల్లాలు ప్రకటిస్తారు అని డిమాండ్ చేశారు.