
– హిజాబ్ ధరించడం ముస్లిం మహిళలకు చాలా గౌరవం.
– రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు వారి యొక్క మతాలను గౌరవించుకునటువంటి స్వేచ్ఛ ఉంది.
విజయవాడ (జనస్వరం) : హిజాబ్ కు మద్దతుగా షేక్ మోబినా, ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వించిపేట గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నుండి పంజా సెంటర్ వరకు వందలాది మంది ముస్లిం మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్దఎత్తున హిజాబ్ మా సాంప్రదాయ వస్త్రధారణ అని, జీవితాంతం హిజాబ్ ధరిస్తామని పెద్దఎత్తున నినదించారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ పాల్గొని ర్యాలీకి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ హిజాబ్ ధరించడం ముస్లిం మహిళల సాంప్రదాయమని, రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు వారి మతాలను గౌరవించుకునటువంటి స్వేచ్ఛ ఉందని, దీనికి అడ్డుతగలడం అంత మంచి పద్ధతి కాదని తెలియజేశారు. కార్యక్రమ నిర్వాహకురాలు మోబినా మాట్లాడుతూ హిజాబ్ ధరించడం చాలా గౌరవమని, రక్షణగా ఉంటుందని, వందలాది సంవత్సరాలుగా ముస్లిం మహిళల జీవితంలో ఇది భాగమని, దీనికి ఎవరైనా అడ్డుతగిలితే ఎంత వరకైనా పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు షేక్ షర్మిల, రెడ్డిపల్లి గంగాధర్, సోమి. గోవింద్, షేక్ గ్యాయసుద్దీన్, పండు, సయ్యద్ అబ్దుల్ నజీబ్, నూనె. సోమశేఖర్, పొట్నూరి. శ్రీనివాసరావు, సాబింకర్. నరేష్, బుర్లే .శంకర్, మైనారిటీ వెల్ఫేర్ చైర్మన్ షేక్ ఆసిఫ్, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ .పతవుల్లా, తదితరులు పాల్గొన్నారు.