
చిత్తూరు ( జనస్వరం ) : చిత్తూరు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారి ఆదేశాల మేరకు పాకాల మండలంలో మండల అధ్యక్షుడు గురునాథ్ తలారి అధ్యక్షతన జనసైనికుల ఆత్మీయ సమావేశం జరిగింది. పాకాల మండల కమీటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. ప్రతి జనసైనికుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి మరియు జిల్లా కార్యదర్శులు ఎం.నాసీర్, మనోహర్, జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.