
తణుకు ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ సూచనల మేరకు తణుకు మండలం వీఆర్వో లు మారుకొండ బలరాం, కట్టుంగ పోసియ్య వీఆర్వో ల నేతృత్వంలో నిరాహార దీక్ష జరుగుతోంది. జనసేన పార్టీ తణుకు నియోజకవర్గం నాయకుడు అనుకుల రమేష్ సందర్శించి వారికి జనసేన పార్టీ పూర్తి మద్దతునిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా అనుకుల రమేష్ మాట్లాడుతూ ఈ రోజు వీఆర్వో ల న్యాయమైన డిమాండ్ రీత్యా పెరిగిన ధరలు దృష్టి లో పెట్టుకుని కనీస వేతనం 21000 రూపాయలు అందజేయాలని, అలాగే ఇచ్చిన డీఏ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని, డిఏతో కూడిన వేతనాలు అందించాలని కోరారు. నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ విఆర్ఏలుగా నియమించాలని, అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా విఆర్వోల న్యాయమైన కోరికలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళకుండా వారి యొక్క దీక్షలను భగ్నం చేసే దిశగా తహశీల్దార్ వారిని విధులకు రావాలని భయపెట్టడం సరికాదని రమేష్ అన్నారు. ప్రభుత్వ పథకాల అమలుకోసం అనుక్షణం కష్టపడే వీఆర్వో లకు తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ తమ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కానూరి మాధవరాయుడు, సుందర వెంకట్రావు, రుద్ర సతీష్ తదితరులు పాల్గొన్నారు.