
పుట్టపర్తి, (జనస్వరం) : అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో గోరంట్ల జనసేన నాయకులు ముద్రించిన నూతన క్యాలెండర్ లను జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారి చేతుల మీదుగా గోరంట్ల నాయకులు శ్రీ వెంకటేష్ తదితరులు క్యాలెండర్ లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను గాజు గ్లాస్ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లాలని ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిలు శ్రీ అబ్దుల్, శ్రీ పత్తి చంద్రశేఖర్, శ్రీ దాసరి రామాంజనేయులు, సంయుక్త కార్యదర్శి శ్రీ విజయ్ కుమార్, శ్రీమతి.అనురాధ, గోరంట్ల శ్రీ హరి తదితరులు పాల్గొన్నారు.