రాయవరం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో ఎటువంటి సంబంధం లేని తనపై తప్పుడు పత్రాలు సృష్టిoచి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న చెల్లూరు గ్రామ పంచాయతీ ఇంచార్జీ కార్యదర్శి దేశాల శ్రీనివాసుపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని జనసేన నాయకులు గొల్లపల్లి వెంకటరమణ అన్నారు. గురువారం తన స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్న తనపై తప్పుడు ప్రచారం చేయడం, తప్పుడు కేసులు బనాయించి తనను ఇబ్బoదికి గురిచేయడం ఎంతవరకు సమంజసమన్నారు. గ్రామ పౌరుడిగా గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుందో తెలుసుకునే భాధ్యత పౌరుడిగా తనకు ఉందన్నారు. ఏదైన సమాచారాన్ని తాను అనేక సార్లు ఫోన్ చేసి తెలుసుకోవడం జరిగింది కానీ సమాచార హక్కు చట్టం ద్వారా నేను ఎటువంటి విషయాన్ని అడగలేదు అన్నారు. కానీ పత్రికలో తన పేరును చేర్చడాన్ని తప్పుబట్టారు. ఆయన సుమారు 6 సంవత్సరాల పైగా పని చేస్తున్న వెంటూరు గ్రామ పంచాయితీలో అవినీతి భారీ స్థాయిలో జరిగిందనే విషయం అదే గ్రామానికి చెందిన గతంలో ఈయన ద్వారా వేదింపులకు, తపుడు కేసులకు గురైన ఒక వ్యక్తి ద్వారా తెలిసిందన్నారు. ఆ వ్యక్తి ఇచ్చిన పూర్తి సమాచారంలో ఇక నుండి ఆయన అవినీతిపై పోరాటం చేస్తానని అన్నారు.