విజయనగరం ( జనస్వరం ) : మహిళలపై దాడులు, అకృత్యాలు రాష్ట్రంలో విరివిగా జరుగుతున్నా దిశా చట్టం వలన మహిళలకు ఉపయోగంగా లేదని ప్రముఖ హైకోర్టు లాయర్, రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి అన్నారు. ఆదివారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో దిశా చట్టం పైన మరియు మహిళలకు జరుగుతున్న దాడులు, అన్యాయాలపై వివిధ మహిళా సంఘాలతోను, ప్రజా, రాజకీయ మహిళా విభాగాల నేతలతో చర్చావేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు,అకృత్యాలు, రోజురోజుకి పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశా చట్టంవల్ల మహిళలకు ఉపయోగంగా లేదని, రాష్ట్రంలో ఎంతమంది మహిళలకు న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు? మహిళలపై దాడిచేయాలన్నా, మహిళ పైన చేయివేయాలన్నా భయపడే కఠినతరమైన చట్టాలు ప్రభుత్వాలు అమలు చేయాలని అన్నారు. అలాగే ఈ దిశా చట్టంలో ఉన్న లోపాలను సవరించి కఠినచట్టం అలులోకి తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఝాన్సీ వీరమహిళ తుమ్మి లక్ష్మీరాజ్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో లోక్ సత్తా పార్టీ నుండి పద్మావతి, జనసేన నుండి మాతా గాయిత్రి, దిశా వేల్ఫెర్ అసోసియేన్ గిరిజ, సి.పి.ఎం.పార్టీ నుండి జగదాంబ, వెంకటలక్ష్మి, వరలక్ష్మి, నీరజ మరియు స్వచ్ఛంద సంస్థ ప్రతనిధులు పలురకాల సూచనలు, సలహాలు ఇస్తూ చర్చలో పాల్గొన్నారు.