పత్తికొండ, (జనస్వరం) : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండల పరిధిలోని కంబాలపాడు నుండి కోయిలకొండకు వెళ్లే మార్గంలో పడిపోయిన బ్రిడ్జినీ తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని క్రిష్ణగిరి మండలం ఎంపీడీవో ఆఫీసర్ కి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి అని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పత్తికొండ నియోజకవర్గ నాయకులు బోయ గోవిందు మాట్లాడుతూ కమలపాడు నుండి కోయిలకొండకు వెళ్లే మార్గంలో బ్రిడ్జ్ పడిపోయి 2 సం.లు గడుస్తున్నా తాత్కాలిక మరమ్మతులకు కూడా నోచుకోక లేదు. రైతులకు అలాగే ఇతర గ్రామాలకు వెళ్లే వాహనదారులకు అక్కడ రాకపోకలు ప్రయాణం చేసేవారికి చాలా ఇబ్బందికరంగా ఉంది. క్రిష్ణగిరి, కంబాలపాడు గురుకుల పాఠశాలకు, కస్తూరిబా పాఠశాలకు హాస్టళ్లకు వెళ్లే విద్యార్థులకు, హాస్పటల్ కు అలాగే పోలీస్ స్టేషన్ కు వెళ్లాలన్న కొన్ని గ్రామాల ప్రజలు ఈ మార్గంలోనే వెళ్ళాలి. ఇతర గ్రామాల నుండి వచ్చే వారు అసౌకర్యంతో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజాశ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని అక్కడ పడిపోయిన బ్రిడ్జిని నిర్మించాలని ప్రజాశ్రేయస్సుకు పాటుపడాలి అని జనసేన పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. దయచేసి ఆ బ్రిడ్జి ని వెంటనే నిర్మించాలని, అలా చేయని పక్షంలో ఈ సమస్యను పరిష్కరించే వరకు జనసేన పార్టీ తరపున ఈ పోరాటాని మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోయ తిరుపాలు, చిరంజీవి గౌడ్, బోయ పులి శేఖర్, రాజు, మోదిన్ బాషా,గోపాల్ గౌడ్, మధు, విజయ్, రాము, కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.