Search
Close this search box.
Search
Close this search box.

నెల్లూరు జిల్లా విభజన చారిత్రక తప్పిదం : జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి

– జిల్లా విభజన అంశంలో ఉద్యమిస్తాం
– ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జిల్లాల విభజన, ఉద్యోగుల్లో భయాలు కల్గించి ఉద్యమం
– జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

     నెల్లూరు, (జనస్వరం) : జనసేన పార్టీ నెల్లూరు సిటీ కార్యాలయంలో పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి జిల్లా విభజన, ఉద్యోగుల ఆందోళన అంశాలపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని ఏమిటో ఇప్పటికీ క్లారిటీ లేని రాష్ట్రంలో జిల్లాల విభజన అనేది ఒక అనాలోచిత, వ్యర్ధపూరిత చర్యగా పేర్కొన్నారు. ఈరోజు ఆర్బీఐ వంటి కేంద్ర సంస్థలు తమ ప్రాంతీయ కార్యాలయాలను ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయకపోవడానికి కారణం ఇక్కడి రాజధాని ఏమిటో ఇప్పటికీ ఎవరికి అర్థం కాకపోవడం వల్లనే అని అన్నారు. కేంద్ర సంస్థలు తమ ప్రాంతీయ కార్యాలయాలను రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటంటే ఆ సంస్థల అధికారులు ప్రభుత్వంతో దగ్గరగా ఉండి తమ కార్యకలాపాలు నిర్వహించుకొనే వెసులుబాటు కోసమే అని అన్నారు. రాజధాని లేని రాష్ట్రంలో ఈ జిల్లాల విభజన కూడా ఒక పిచ్చి చర్యగా మారుతోందన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం అంటే జిల్లా కేంద్రం మండలాలకు, గ్రామాలకు దగ్గరగా ఉండాలని, కాని ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న జిల్లా కేంద్రాలు చాలా మండలాలకు దూరంగా ఉంటున్నాయని, ఇదేమి పరిపాలనా సౌలభ్యం అని ఎద్దేవా చేశారు. గూడూరు వంటి ప్రాంతాలకు నెల్లూరు దగ్గరా లేక తిరుపతి దగ్గరా చెప్పండని ప్రశ్నించారు. 200 ఏళ్లకు ముందు బ్రిటిష్ కాలంలో ఏర్పడిన  నెల్లూరు జిల్లా యాసకు, ప్రాంతానికి చాలా ప్రాముఖ్యం ఉందన్నారు. 1911 లో చిత్తూరు జిల్లా ఏర్పాటు అయ్యేటపుడు అనేక ప్రాంతాలను, 1970లో ప్రకాశం జిల్లా ఏర్పాటయ్యేటప్పుడు కొన్ని ప్రాంతాలను నెల్లూరు జిల్లా కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రం జిల్లాకు ఒక ఐకాన్ లా ఉంటుందని ఇప్పుడు దాన్ని జిల్లావాసులు కోల్పోవాలా అని ప్రశ్నించారు. తమిళనాడు రాష్ట్రంతో బార్డర్ పంచుకునే జిల్లాలో సంస్కృతి ప్రక్క రాష్ట్రంతో మమేకమయ్యేలా ఉంటుందని అటువంటి ప్రాంతాన్ని నెల్లూరుకి దూరం చేస్తారా అని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ శ్రీహరికోట, చెంగాళమ్మ దేవస్థానం, పులికాట్ సరస్సు, మేనకురు సెజ్, శ్రీసిటీ, పెంచలకోన, కండలేరు రిజర్వాయర్, అబ్రకం గనులు, సిలికా గనులు, ఎర్ర చందనం చెట్లు వంటి ప్రాంతాలను దూరం చేసుకోవడానికి నెల్లూరు జిల్లా ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. ఈ జిల్లాల అంశం కాని, ఇప్పుడు తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డున పడి నిరసనలు తెలుపుతున్న విషయం కాని, ప్రభుత్వం తన తప్పులను కప్పి పుచ్చుకునే అంశంలో వేస్తున్న అడుగుల మాదిరిగానే కనిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  పావుజెన్నీ చంద్రశేఖర్ రెడ్డి, అమంచర్ల శ్రీకాంత్, జఫర్, కార్తిక్, రాము, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way