– నిందితులను తప్పించాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అసలు నేరస్తుడు.
– ప్రాథమిక నివేదికలో అస్లాంది సాధారణ మరణం కాదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించిందా?
– పోలీస్ శాఖ వారిని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఒత్తిళ్లకు తలొగ్గదని విజ్ఞప్తి చేస్తున్నాం.
– పోలీస్ శాఖ వారు ఈ కేసులో వాస్తవాలను బహిర్గతం చేయాలి.
– ఒక పథకం ప్రకారం ఈ కేసును పక్కదారి పట్టించేందుకు మైనర్ ని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
– పశ్చిమ నియోజకవర్గంలో గతంలో అన్ని ప్రధాన కేసుల్లో ప్రధాన నిందితులు తప్పించుకున్నారు.
పోలీస్ శాఖ కేసును పారదర్శకంగా విచారణ చేయాలి
– జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్
విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ అస్లాం మృతి కేసులో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మౌనంగా ఎందుకు ఉంటున్నారో సమాధానం చెప్పాలని విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ ఆదివారం డిమాండ్ చేశారు. అస్లాం మృతిపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని, ప్రాథమిక నివేదికలో ఇది సాధారణ మరణం కాదని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చిందాని, అయినా అస్లాం మరణం వెనుక ఉన్న నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కేసులో అసలు నేరస్తుడిని మహేష్ అన్నారు. మంత్రికి కొండపల్లి బుజ్జి ద్వారా రూ.20 లక్షలు ఇస్తే మోసం చేసిన వారిని కాపాడతారా అని ప్రశ్నించారు. అస్లాం మృతి ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, అయినప్పటికీ మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా దుర్మార్గమని, మంత్రి అనుమానితులకు ఈ కేసులో అండగా నిలబడే ప్రయత్నం బలంగా చేయబట్టే అస్లాం మృతి కేసు విషయంపై దోషులను పట్టుకుంటామని, కఠినంగా శిక్షిస్తామనే ప్రకటన కూడా చేయకపోవడం మంత్రి నిజస్వరూపాన్ని బయట పెట్టిందన్నారు. ఈ కేసును ఒక పథకం ప్రకారం పక్కదారి పట్టించే ప్రయత్నం మంత్రి చేస్తున్నారని అందుకే పోలీస్ శాఖపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. మహిళల్ని మాయమాటలతో మోసం చేసిన వారిని మంత్రి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, ఇటువంటి సంఘ వ్యతిరేక శక్తులను కాపాడే ప్రయత్నం చేస్తే మంత్రికి తగిన బుద్ది ప్రజలు చెబుతారన్నారు. పోలీసులు కూడా రాజకీయ ఒత్తిడులకు తలొగ్గద్దని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. గతంలో ఇదే తరహాలో మంత్రి ఒత్తిడితో కేసులు పక్కదారి పట్టిన సందర్భాలు ఉన్నాయని, సయ్యద్ అస్లాం కేసులో కూడా అసలు దోషులును తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, మంత్రి గతంలో పశ్చిమ నియోజకవర్గంలోని అనేక ప్రధాన కేసుల్లో దోషులు తప్పించుకున్నారు ఇందులో ఇసుక మాఫియా కేసులో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సోదరుడు రఘు, భోగవల్లి సత్రం ట్రస్ట్ కేసు విషయంలో మంత్రి ఓఎస్డీ, కోటి రూపాయలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో వేరే ఖాతాలో జమ చేసి వసూలు చేసిన అంశంలో ఇలా అన్ని ప్రధాన కేసులో మంత్రి పోలీస్ శాఖ వారికి ఒత్తిడి చేసి నిందితులను తప్పించిన దాంట్లో భాగస్వామ్యం ఉన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అదేవిధంగా అస్లాం మృతి కేసులో కూడా అసలు దోషులను మంత్రి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని, అనేక కేసులలో వెల్లంపల్లి శ్రీను పోలీసులపై ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవం కదా..? అని దుయ్యబట్టారు. ఎటువంటి ఒత్తిడులకు పోలీసులు లొంగకూడదని, అస్లాం కేసు దర్యాప్తుపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలని, ఈ కేసులో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పారదర్శకంగా విచారణ చేసి అస్లాం మృతిపై వాస్తవాలను బహిర్గతం చేయాలని పోలీస్ శాఖ వారిని కోరారు. అస్లాం కేసులో పేరు చెప్పకపోయినా… కొంతమంది భుజాలు తడుముకుంటున్నారని, అన్వర్ లాంటి వ్యక్తులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని, పాతబస్తీలో అన్వర్ పేరే… ప్రధానంగా వినిపిస్తుందని, మహిళలపై దౌర్జన్యం చేసిన కేసులు అన్వర్ పైన ఉన్నాయని, అస్లాం మృతి వెనుక, డబ్ను మాయం వెనుక అన్వర్ పాత్రపై పోలీసులు విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎవరు ఇప్పటి వరకు ఏ ఒక్క వ్యక్తి పేరు చెప్ప లేదని, కానీ అన్వర్ తానే దోషిననే విధంగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారని, పదేపదే మా మంత్రి మా మంత్రి అన్నారు అంటే అతనికి మంత్రి మద్దతు ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థం అవుతుందని అందుకనే అన్వర్ కు మంత్రి సపోర్టు ఉందని భావిoచాలని, సామాజిక మాధయమాల్లో నువ్వు చేసిన వ్యాఖ్యల ఆధారంగా నువ్వే అసలైన నిందితుడు అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు క్రిమినల్స్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని, ఇది అంత మంచిపద్ధతి కాదన్నారు. అస్లాంకి న్యాయం జరిగే వరకు ఈ కేసు పై మా వంతుగా న్యాయ పోరాటం సాగిస్తామని, అస్లాం అనుమానాస్పద మృతి కేసులో సీఎం జగన్ జోక్యం చేసుకొని అస్లాం మృతి కేసులో దోషులకు శిక్ష పడేల చేయాలని, వెల్లంపల్లి వంటి అవినీతి పరుడిపై జగన్ చర్యలు తీసుకోవాలని మహేష్ డిమాండ్ చేశారు. అందరూ ఐక్యంగా పోరాడి… అస్లాంను చంపిన వారికి శిక్షలు పడేలా పోరాడాలని, ఈ సంఘటనపై మంత్రి వెల్లంపల్లి స్పందించాలని, మౌనం వీడకపోతే మీరే అసలు నేరస్తుడని నమ్మ్మవలసి వస్తుంది మహేష్ అన్నారు.