🔸దగ్గరుండి వినతిపత్రాలు రాయించిన జనసేన
🔸నేడు స్కూళ్ళు మూసేందుకు జనసేన యత్నం
🔸అడ్డుకున్న పోలీసులు
విజయనగరం, (జనస్వరం) : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్ పాలవలస యశస్వి జిల్లాలో కరోనా ఉదృతంగా పెరుగుతున్న తరుణంలో విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు అధ్యాపకులకు కరోనా బారినుంచి కాపాడుదామనే ఊదేశ్యంతో జిల్లా కలెక్టర్ కు, జిల్లా విద్యాశాఖ వారికి తాత్కాలికంగా బడులు మూయాలని వినతిపత్రాలను ఇచ్చినా ఫలితం లేకపోవటంతో, మరలా ఈమధ్యనే పట్టణంలో పలు పాఠశాలలు పర్యటనల్లో స్కూల్ ప్రధానోపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ కు, జిల్లా విద్యాశాఖ అధికారులకు తాత్కాలికంగా బడులు మూయమని వినతిపత్రాల్ని ఇమ్మనమని జనసేన కోరింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం, మున్సిపల్ పరిధిలో ఉన్న కస్పా స్కూల్ కు జనసేన పార్టీ నాయకురాలు యశస్వితో పాటు పలువురు జనసేన నాయకులతో వెళ్లి స్కూల్ అధికారులకు ఆరా తీయగా ప్రధానోపాధ్యాయులు వినతిపత్రం ఇవ్వలేదని తెలియడంతో జనసేన నాయకురాలు యశస్వి దగ్గరుండి కస్పా స్కూల్ ప్రధానోపాధ్యాయులచే మున్సిపల్ కమిషనర్ కు, జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రాన్ని రాయించడం జరిగింది. ఈ సందర్భంగా యశస్వి గారు మాట్లాడుతూ జిల్లాలో రోజుకు వందలాది కరోనా కేసులు నమోదు అవుతున్నాయని, అందుకు పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల తల్లిదండ్రులకోసం, మరియు అధ్యాపకుల ఆరోగ్యం కోసమే జనసేన తాత్కాలికంగా విద్యాసంస్థలను మూయాలని కోరుతుందని, భవిష్యత్తులో జిల్లా అధికారులు విద్యా సంస్థలు మూయకుండా, పట్టించుకోకుండా ఉంటేగనుక జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), యర్నాగుల చక్రవర్తి, దాసరి యోగేష్, లోపింటి కళ్యాణ్, బొబ్బాది చంద్రు నాయుడు, కిలారి ప్రసాద్, మజ్జి శివశంకర్, శ్రీను, రమేష్, మురళీమోహన్, కృష్ణా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.