
ఉరవకొండ, (జనస్వరం) : అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూర్ మండలం జనసేన పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వజ్రకరూర్ మండల అధ్యక్షుడు కేశవ్ అచ్చనాల గారి అధ్యక్షతన మండల కమిటీ ఏర్పాటు మరియు జనసేన పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా నిస్వార్థంగా కష్టపడే నిస్వార్థ జనసైనికులకు పార్టీ కార్యవర్గ కమిటీలో పెద్దపీట వేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కమిటీ సభ్యులందరూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి ఆ సమస్యల పరిష్కారం దిశగా ప్రజాక్షేత్రంలో జనసైనికులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తూ ప్రజలకు మరింత దగ్గరవుతూ రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించడానికి అహర్నిశలు పాటుపడాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గం నాయకులు, మండల కమిటీ సభ్యులతోపాటు పలువురు నాయకులు, నిస్వార్థ జనసైనికులు, అభిమానులు పాల్గొన్నారు.