
● పలు స్కూళ్ళు సందర్శన
● కోవిడ్ నిబంధనలు పాటించని స్కూళ్ళు గుర్తింపు
●తాత్కాలికంగా స్కూళ్ళు మూయాలని జనసేన డిమాండ్
● నేడు స్కూళ్ళు మూసేందుకు జనసేన శ్రీకారం
విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లాలో కరోనా ఉదృతంగా పెరుగుతున్న తరుణంలో తాత్కాలికంగా స్కూళ్ళు, విద్యాసంస్థలు మూసివేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్ పాలవలస యశస్వి గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. పట్టణంలో మంగళవారం & గురువారం కస్పా, బి.పి.ఎమ్. స్కూల్లతో పాటు పలు స్కూళ్లను సందర్శించారు. స్కూళ్లల్లో విద్యార్థులకు, శ్యానిటేజర్, మాస్కులు ఏర్పాటు చేయకుండా కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఉండడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. పిల్లల పట్ల ఇంత నిర్లక్ష్యమా అని ఈ విపత్కర పరిస్థితుల్లో తాత్కాలికంగా కొద్దిరోజులు స్కూళ్ళు మూసివేయాలని, పిల్లలకు ఆన్లైన్ తరగతులు పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే స్కూళ్లను మూయించే బాధ్యత జనసేన తీసుకుంటుందని, ఇందులో భాగంగా శుక్రవారం స్కూళ్ళు మూసేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. జనసేన ముఖ్యఉద్దేశ్యం కేవలం పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కరోనా సోకకుండా ఉండేందుకు మాత్రమేనని, ఇందులో రాజకీయాలకు తావులేదని, దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని అన్నారు.