శ్రీకాళహస్తి, (జనస్వరం) : గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా ఏర్పేడు మండలం, ఏర్పేడు పట్టణంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం KNOW MY CONSTITUENCY కార్యక్రమంలో భాగంగా జనసైనికుల అభ్యర్థన మేరకు విష జ్వరాలతో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూతో ఇబ్బందులు పడుతున్న కొత్త వీరాపురం గ్రామాన్ని సందర్శించి మెడికల్ క్యాంపు కడప జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షులు Dr. రెడ్డి ప్రసాద్ గారి సహకారంతో నిర్వహించి, గ్రామంలోని వందల మంది ప్రజలకు ఉచితంగా వైద్యం అందించి, వారికి పరీక్షలు చేసి సరిపడా మాత్రలు, ఇంజెక్షన్లు వెయ్యడం జరిగింది. రెండు నెలలుగా విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నా కూడా అధికారులు ఎవరు పట్టించుకోలేదు అని ప్రజలు తెలియజేశారు, డ్రైనేజ్ కాలువలు అస్సలు లేనందున మురికి నీరు వీధుల్లో నిల్వ ఉండడం వల్ల ఈ విష జ్యిరాలకు కారణం అని ప్రజలు తెలియజేశారు. గ్రామం లో పర్యటించి సమస్యలను వినుత గారు పరిశీలించడం జరిగింది. ఈ సమస్యలను మండల అధికారులు, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళతామని, పరిష్కారం అయ్యే వరకు ప్రజలకు అండగా ఉంటామని బరోసా ఇవ్వడం అడిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షుడు కిరణ్ కుమార్, రేణిగుంట మండల అధ్యక్షుడు మునికూమర్ రెడ్డి, నాయకులు నితీష్, వినోద్, చందు చౌదరి, రవికుమార్, తేజా, గిరీష్, మునిసేఖర్, మధు, వంశిధర్, రామకృష్ణ, జనసైనికులు పాల్గొన్నారు.