పశ్చిమ గోదావరి ( జనస్వరం ) : 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏలూరులో ఘనంగా జరిగాయి. మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ విభాగంలో ” అత్తిలి -1″ సచివాలయం జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా గారు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్చంచ్ శ్రీమతి ‘గంటా విజేత’ గారికి, సచివాలయ సిబ్బందికి పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా గంటా విజేత మాట్లాడుతూ తనను జిల్లా ఉత్తమ స్థానంలో నిలిచేందుకు కృషి చేసిన జనసేన నాయకులకు, వీరమహిళలకు, సచివాలయ సిబ్బంది, సచివాలయ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు సామాన్యులను సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రజాసేవ చేయాలనే తపన కలిగించారు. ఆ స్పూర్తితోనే ఈరోజు నేను ఒక గ్రామ సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహిస్తూ జిల్లాకే ఆదర్శం అయ్యాను. రానున్న రోజుల్లో మా సచివాలయంలో మరింత బాధ్యతాయుతంగా పని చేసి రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తామని అన్నారు. సామాన్యులకు సైతం రాజకీయ పదవుల ద్వారా సేవాభావం చేయడం ఒక జనసేనపార్టీకే సాధ్యమని అన్నారు.