అనంతపురం జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపిన SSBN కళాశాల విద్యార్థులు

    అనంతపురం, (జనస్వరం) : SSBN కాలేజ్ ప్రైవేటీకరణ కాకుండా…ఎయిడెడ్ కాలేజీ గా నేడు GO రావడానికి ప్రధాన కారకులైన మా శ్రేయోభిలాషి జనసేన పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామ్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. SSBN కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిన నాటి నుండి… నేడు ఎయిడెడ్ కాలేజీగా GO వచ్చేవరకూ ఉద్యమం పక్కదారి పట్టకుండా మా కాలేజీ విద్యార్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సూచనలు మరియు సహాయ సహకారం అన్ని విధాలుగా అందించి, పోలీసు వారు అక్రమంగా క్రిమినల్ కేసులు పెట్టినా బెదరకుండా, మా సమస్య పరిష్కారమే ధ్యేయంగా మాకు అండదండగా నిలిచిన జనసేన పార్టీకి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గారికి, ఈశ్వరయ్య గారికి, జనసేన నాయకులు చరణ్ తేజ గారికి, శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో SSBN కళాశాల విద్యార్థి నాయకులు S.అశోక్ కుమార్, A.సందీప్ రెడ్డి, A.అజయ్ కుమార్, T.నవీన్ కుమార్, Y.వంశీ, అబ్దుల్ రెహమాన్, గౌతం తదితరులు పాల్గొన్నారు.

See also  పెద్ద అబ్బీపురం గ్రామ రైతులకు న్యాయం చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన జనసేన నాయకులు నలిశెట్టి శ్రీధర్