తూర్పుగోదావరి ( జనస్వరం ) : ప్రమాదం అంచున లక్షలాది విద్యార్థులు, కరోనా మహమ్మారి మళ్లీ విజృంభవిస్తున్న వేళ వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం మొండి వైఖరితో పిల్లలకి తరగతులు నిర్వహించడంపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ వీరమహిళా విభాగం తరుపున వీరమహిళలు వారి గళాన్ని బలంగా వినిపించారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి కాకినాడ సిటీలో జనసేన వైసీపీ ప్రభుత్వ మొండి వైఖరిని నిరసన వ్యక్తం చేసారు. కరోనా ఉదృతి దృశ్యా APలో ఇంకా పిల్లలకి వ్యాక్సినేషన్ పూర్తి కాకపోవడం, వారి ఆరోగ్య క్షేమం కోసం ప్రస్తుతం తరగతులు వాయిదా వెయ్యాలని, కరోనా టెస్టులు చెయ్యకుండా, స్కూళ్లలో కనీసం జాగ్రత్తలు పాటించకుండా, శానిటైజర్, మాస్కులు కూడా ఇవ్వలేని ప్రభుత్వం పిల్లలు కరోనా బారిన పడితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వారి ప్రాణాలకు ఎంత ముప్పు వాటిల్లుతుంది, తల్లిదండ్రులు భయాందోళనలతో పిల్లలని బడికిపంపిస్తున్నారు. ఈ కరోనా వేవ్ తగ్గుముఖం పట్టేవరకు AP లో తరగతులు వాయిదా వెయ్యాలని వైసీపీ ప్రభుత్వంపై ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొని నిరసన తెలిపారు.