ఎమ్మిగనూరు, (జనస్వరం) : రాష్ట్రములో కరోనా కేసులు రోజు రోజుకు ప్రమాదకరంగా పెరుగుతున్న ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై శ్రద్ద లేకుండా పాఠశాలలు నిర్వహించడం వలన కరోనా బారిన పడుతున్న పిల్లల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుందని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ మీడియా ఇంఛార్జ్ గానిగ బాషా తెలిపారు. సోమవారం రోజు మండల కేంద్రమైన గోనెగండ్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కరోనా కేసుల పెరుగుదల వలన పిల్లల తల్లితండ్రులు భయాందోళనకు గురవుతున్నారని చాలా వరకు పాఠశాలలకు పిల్లలను పంపించడం లేదని కరోనా బారినపడి బాధపడుతున్న పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నప్పటికి తమ బిడ్డల ఆరోగ్యం విషయంలో తల్లి తండ్రులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పరిగణించి కరోనా తగ్గుముఖం పట్టే వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీవర్ సర్వేలు చెబుతున్న విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రతి నలుగురిలో ఒకరు బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్టింగ్ కిట్స్ అందుబాటులో వుంచి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ఒక్కరోజులోనే 14 వేలకు పైగా కేసులు వచ్చాయని కరోనా కేసులు పెరిగినపుడు విద్యా సంస్థలను మూసివేయడం గురించి చూద్దామని చెప్పిన విద్యా శాఖ మంత్రికి కేసుల పెరుగుదల కనిపించడం లేదా అని ప్రశ్నించారు.