
టెక్కలి, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మంచి నీటి ప్రాజెక్ట్స్ లో పని చేస్తున్న కార్మికులుకి 23 నెలలుగా జీతాలు లేక కార్మికులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరి సమస్యలుపై వెంటూనే స్పందించి 23 నెలలు జీతాన్ని ఇప్పించాలి అని ఈరోజు టెక్కలి మంచి నీటి ప్రాజెక్ట్ ఏరియాలో సమావేశమై జీతాలు వెంటూనే చెల్లించాలి అని డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో కార్మికులకు బాసటగా పాల్గొన్న జనసేన నాయకులూ కూరాకుల యాదవ్ మాట్లాడుతూ దాహం తీర్చేవాడి ధాతృతత్వానికి ఈరోజు కష్టం వచ్చింది అని కార్మికులకు చెల్లించవలసిన పెండింగ్ వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి అని అన్నారు. అన్ని విభాగాల కార్మికులు ఐక్యం అవ్వాల్సిన సమయం వచ్చింది అని అన్నారు. పలాస నాయకులు హరీష్ కుమార్ శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ౩౦ సంవత్సరాలుగ జిల్లాలో ఉన్నటువంటి ఈ మంచి నీటి ప్రాజెక్ట్స్ లో పనిచేస్తున్న కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు అని, ఎలాంటి కార్మిక చట్టాలు వీరికి అమలు చెయ్యడం లేదు అని ప్రభుత్వమే కార్మిక చట్టాలను అతిక్రమిస్తే ఎలా అని వీరందరికీ వెంటూనే ప్రభుత్వ ఉద్యోగుల గా గుర్తించి పి.ఎఫ్, ఇ.స్.ఐ లాంటి సదుపాయాలు కల్పించాలి అని డిమాండ్ చేసారు. మెట్ట అవినాష్ మాట్లాడుతూ ఇటీవల చనిపోయిన సోంపేటకు చెందిన ఉద్దాన నీటి ప్రాజెక్టు కార్మికుడి కుటుంబానికి జనసేన పార్టీ తరుపున ఆదుకుంటాం అని హామీ ఇచ్చారు. కార్మికులు భవిషత్తులో చేయబోయే పోరాటాలకు జనసేనపార్టీ తరపున సంపూర్ణంగా వారు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సి.హెచ్ వెంకట రమణ, రాయల్ సునీల్ మరియు రాష్ట్ర నీటి ప్రాజెక్ట్స్ కార్మికుల కార్యవర్గ నాయకులు సభ్యులు పాల్గొన్నారు.