అనంతపురం, (జనస్వరం) : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం తన వ్యక్తిగత కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీ వరుణ్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ఆశుతోష్ మిశ్రా శేరివిజన్ కమీషన్ రిపోర్టును బహిర్గతం చేయకుండా సెక్రటరీ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని కార్యదర్శల కమిటీ నివేదిక ఆధారంగా చేసిన పీఆర్సీ సంబంధిత ప్రకటనను ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఏకతాటిపై వచ్చి తిరస్కరించారన్నారు. ఉద్యోగులకు జనసేన పార్టీ నుండి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు. అలాగే 30 శాతం ఫిట్‌మెంట్‌తో 2019 జులై 1, ఆర్థిక ప్రయోజనాలతో పీఆర్సీ అమలు చేయాలని, ఇంటి అద్దె బిల్లులు, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ ప్రస్తుతం అమలులో ఉన్న స్లాబులలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. పెండింగులో ఉన్న 5 డీఏలను రిలీజ్ చేయాలని, పే రివిజన్ కమిషన్‌ను ఐదేళ్లకొకసారి నియమింపబడ్డ ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని, కాంట్రాక్ట్ _అవుట్ ఔర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పదవీ విరమణ వయస్సు 60 ఏళ్ల నుండి 62 ఏళ్ల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శులు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.