అనాధలకు అండగా, జనసేనపార్టీకి తోడుగా : బ్రహ్మాస్త్రం నాగు

బ్రహ్మాస్త్రం నాగు

               విశాఖపట్నం ( జనస్వరం ) : గాజువాకలో అనాధలకు అండగా ఉంటూ వారి ఆకలిని తీరుస్తూ, సమాజంలో మంచి మార్పు కోసం జనసేన పార్టీకి తోడుగా రేపాక నాగేశ్వరరావు తన సేవలను అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే విజయనగరంలో గరివిడి గ్రామంలో జన్మించారు. వృత్తిరీత్యా గాజువాకకు 1998 సం.లో వలస వచ్చారు. ఒక సగటు మనిషి రాజకీయాలు పట్టించుకొనే పరిస్థితి ఉండేది కాదు ఆ రోజుల్లో… కానీ బ్రహాస్త్రం నాగు ఆరోజుల్లోనే రాజకీయాల మీద మమకారంతో రాజకీయ విశ్లేషణలు చేస్తుండేవారు. అవినీతి వ్యధలను అంతం చేయాలని నిత్యం పరితపించేవారు. తనకున్న ఆలోచనలను పేపరు మీద కలం పెట్టి తన గళాన్ని వినిపించసాగారు. అలా 2014 సం.లో నాగాస్త్రం “ అనే పుస్తకాన్ని 120 పేజీలతో రచించాడు.  58000 కాపీలు ప్రింట్ చేయించి ఉచితంగా సామాన్య ప్రజలకు పంచి పెట్టారు. ప్రజలలో రాజకీయ అసమానతల్ని తొలగించేలా, సామాజిక బాధ్యతల్ని పెంచేలా నిత్యం ప్రజలలో తిరుగుతూ అవగాహన కల్పించేవారు. యువతకు రాజకీయం అర్థమయ్యేలా, సామాన్యులు సైతం సమాజం పట్ల అవగాహన కల్పించుకునేలా 2021 సం.లో  బ్రహ్మాస్త్రం ” అనే పుస్తకాన్ని రచించి 7000 కాపీలను ప్రజలకు ఉచితంగా పంచిపెట్టారు. చదువు అందరికి ఆండాలనే ఉద్దేశ్యంతోనే పుస్తకాలను ఉచితంగా పంచేవారు. జనసేన పార్టీ సిద్దాంతాలను తెలిపేలా క్యాలెండర్లను సామాన్య ప్రజలకు అందించారు. 

           తనలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి సమాజం మీద బాధ్యతతో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ గారికి దాసోహం అయ్యారు. జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్ళేవారు. ప్రజలకు దగ్గర అవుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేవారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేసేవారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరుపున పోటీ చేయాలని ధృఢ సంకల్పించుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆ స్థానంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని తెలుసుకొని విరమించుకున్నారు. స్వంత ఖర్చులతో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేశారు. జనసేన మ్యానిఫెస్టోను 7000 ప్రింట్లు తీయించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కళ్యాణ్ గారు ఓడిపోయారని బాధపడినా తిరిగి తేరుకొని ప్రజలలో నేటి వరకూ జనసేన భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు. సామాన్య ప్రజలకు జనసేన సిద్దాంతాలని తెలియజేస్తూ ప్రజలలో బలంగా ఉండేలా త్రినేత్రం టీం, బ్రహ్మాస్త్రం టీం, సుభాష్ చంద్రభోష్ టీం ఇలా పలు రకాల టీంలను నిర్వహిస్తున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికార లక్ష్యంగా జనసేన పార్టీని విస్కృత ప్రచారం చేస్తున్నారు. 

             తాను చిన్నప్పటి నుండి అనాధ పిల్లల బాధలను అనుభవించానని, అందుకే వారి కోసం ఏదైనా చేయాలని నిరంతరం తపిస్తుంటానని అన్నారు. గాజువాకలోని అనాధ ఆశ్రమాలకు బ్రహ్మాస్త్రం కిట్టు పేరుతో 15 రకాల వస్తువులను అందజేస్తున్నారు.  ఈ కార్యక్రమాలు అన్నీ తన స్నేహితులు, శ్రేయోభిలాషులు అందించే ఆర్థిక సహకారంతో చేస్తున్నానని అన్నారు. ఇప్పటిదాకా 168 అనాధాలకు బ్రహ్మాస్త్రం కిట్లను అందించారు. బ్రహ్మాస్త్రం నాగు ఇలా పలురకాల సేవలను అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way