వెదురుకుప్పం, (జనస్వరం) : చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బొమ్మయ్య పల్లి గ్రామపంచాయతీ బొమ్మయ్యపల్లి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కవిత అనే ఒక నిరుపేద మహిళలకు స్టవ్ మరియు గ్యాస్ సిలిండర్ ను జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ Dr యుగంధర్ పొన్న అందజేశారు. అదే విధంగా జావేద్ తుఫాన్ వల్ల దెబ్బతిన్న గృహాన్ని సందర్శించి ఆ కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. ఈ సందర్భంగా Dr యుగంధర్ మాట్లాడుతూ జనసేన పార్టీ సేవకే గాని సంపాదనకు కాదని అంచెలంచెలుగా అది అభివృద్ధి చెందుతూ నిరూపితమవుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అభివర్ణించారు. సర్వారంగ సమగ్రాభివృద్ధి ఈ రాష్ట్రంలో ఒక్క పవన్ కళ్యాణ్ ద్వారా మాత్రమే సాధ్యం అని తెలిపారు. ప్రజా సేవే జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తుందని, 2023 జమిలి ఎలక్షన్ అయినా, 2024 జనరల్ ఎలక్షన్ అయినా కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అని, యువత భవిష్యత్తు మార్గదర్శి పవన్ కళ్యాణ్ మాత్రమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పురుషోత్తం, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షులు సతీష్,ముని, కార్వేటి నగరం మండల ఉపాధ్యక్షులు విజయ్, వెంకటేష్,రాజు,గుణ, మోహన్, కేశవ్, దినకర్,వినోద్ కుమార్, జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.