
అనంతపురం అర్బన్, (జనస్వరం) : అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం పంచాయతీలో జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ గారు జనసేన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం ఆయన సమక్షంలో టిడిపి, వైసిపి పార్టీల కార్యకర్తలు 200 మంది జనసేన పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల కార్యనిర్వాహణ కార్యదర్శి భవానీ రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళి కృష్ణ, రాప్తాడు ఇంఛార్జ్ సాకే పవన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు శ్రీ పత్తి చంద్రశేఖర్, శ్రీ నాగేంద్ర, కార్యదర్శులు రాపాక ధనంజయ్, సంజీవ రాయుడు, కిరణ్ కుమార్, నారాయణస్వామి, విజయ్ కుమార్, జయలక్ష్మి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ పద్మ, రూప, అర్బన్ నాయకులు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.