
ఆమదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం రెడ్డిపేట గ్రామనికి చెందిన జనసైనికుడికి యాక్సిడెంట్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న ఆమదాలవలస ఇంఛార్జ్ పేడాడ రామ్మోహనరావు గారు ఆసుపత్రికి వెళ్లి జనసైనికుడికి 10000 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే డాక్టర్ తో మాట్లాడి విషయాలు తెలుసుకొని ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.