
హనుమకొండ, (జనస్వరం) : జి.ఓ నెంబర్ 317ను రద్దు చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జ్ శ్రీ ఆకుల సుమన్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఘన చరిత్ర గల తెలంగాణ ఉద్యమం ముల్కీ నిబంధనలతో మొదలై 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సుఖాంతం అయిందని అనుకున్నాం కానీ 317 జీ.ఓ తో సమస్య మళ్లీ మొదటికి వస్తుందని అనుకోలేదు. తెలంగాణ ఉద్యమ చరిత్ర గలవారి ప్రభుత్వంలో ఈ విధమైన పరిస్థితి దాపురించడం శోచనీయం. స్థానికత ఆధారంగానే చేయాలి. ఈ 317 జి.ఓ వలన ఉద్యోగులు అనేక ఇబ్బందులు పదుతున్నారని అన్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల సంఘాలతో, ప్రతిపక్ష పార్టీలతో చర్చించి బదిలీలను చేయాలని కోరారు. 317జి.ఓ రద్దు చేసేవరకు జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు.