గుడివాడ, (జనస్వరం) : కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన నాయకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన గుడివాడ నియోజకవర్గ నాయకులు బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ, వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేటికీ గుడివాడ పురపాలక సంఘ ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. వైకాపా పార్టీ నాయకులు టిడిపి నాయకులు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని ఇప్పటికైనా స్థానిక మంత్రి వర్యులు కొడాలి నాని స్పందించి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. గుడివాడ పట్టణంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ప్రతి వార్డులోని జనసేన పార్టీ తరఫున అభ్యర్థి నిలబెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీకి సిద్ధంగా ఉందని ఆయన తెలియజేశారు. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో పట్టణ అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు అని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక మంత్రి స్పందించి గుడివాడలో మున్సిపల్ ఎన్నికలు జరిగే విధంగా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొదమల గంగాధర్, మీరా షరీఫ్, జేమ్స్, ప్రసాద్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.