
తూర్పుగోదావరి, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకులు విస్తృతస్థాయి సమావేశం రామచంద్రపురం లైన్స్ క్లబ్ ఆవరణలో నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో నూతనంగా మండల కమిటీలు ఏర్పాటులో భాగంగా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మండల అధ్యక్షులను జిల్లా కార్యవర్గానికి రాష్ట్ర కార్యవర్గానికి పరిచయం చేశారు. అనంతరం ఇటీవల మండపేట నియోజకవర్గం వల్లూరు గ్రామంలో దళిత మహిళా సర్పంచ్ పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేసును తప్పుదారి పట్టించే విధంగా సర్పంచ్ ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా పోలీసులు తప్పుడు పిర్యాదు సృష్టించి వేరే కేసు నమోదు చేసి సరికొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. తక్షణమే మీనాకుమారి గారు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ లీలాకృష్ణ గారిపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలనే డిమాండ్ తో స్థానిక ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. ఆర్డీవో తో దుర్గేష్ గారు ఫోన్లో మాట్లాడడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు మాట్లాడుతూ మండపేట నియోజకవర్గం వల్లూరు గ్రామంలో దళిత మహిళా సర్పంచ్ కు న్యాయం జరిగే వరకూ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గం ఇంచార్జి శెట్టిబత్తుల రాజబాబు గారు, పీఏసీ సభ్యులు ముత్తాశశిధర్ గారు, పితాని బాలకృష్ణ గారు, మేడా గురుదత్తా ప్రసాద్ గారు మరియు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వివిధ నియోజకవర్గ ఇంఛార్జిలు, జనసేనపార్టీ నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.