
టెక్కలి, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం జనసేనపార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల వినోదం కోసం సినిమా టికెట్ల రేట్లను తగ్గించిన ప్రభుత్వం, పండుగలకు సొంతూళ్లకు వెళ్లేవారికి భారం అయ్యేలా ఆర్టీసీ బస్సు ఛార్జీలను ఎందుకు పెంచారో ప్రజలకు వివరణ ఇవ్వాలని జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇంఛార్జ్ కణితి కిరణ్ కుమార్ గారు డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కణితి కిరణ్ గారు మాట్లాడుతూ, పొట్టకూటి కోసం తమ సొంత ఊర్లను, తల్లిదండ్రులను మరియు బందువర్గాలను వదులుకుని, ఎక్కడో దూరాన ఉన్న ప్రాంతాలకు వలస వెళ్లి, సరైన తిండి లేక, చాలి చాలని జీతాలకు పనుకు చేసుకొని, రూపాయి రూపాయి దాచుకొని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఊర్లకు వెళ్లి సొంతవారిని చూసుకొనే వారిని దోచుకునే ప్రక్రియగా ఇలా ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడంలో ప్రభుత్వ వైఖరి ఏంటో అర్ధం కావడం లేదని విమర్శించారు. నిత్యావసర సరుకులు రేట్ల విషయాల్లో, ప్రయాణానికి అందుబాటులో ఉండవలిసిన ఛార్జీల విషయంలో పేదవారికి అందుబాటులో ఉండవలిసిన ఏ ఒక్కదాని మీద అందుబాటు ధరల్ని నిర్ణయించలేని ప్రభుత్వం, సినిమా టికెట్ల మీద మాత్రం ఎందుకు అంత చొరవ తీసుకుంటుందో అర్ధం కావడం లేదని కనీసం వారికైనా తెలిస్తే ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీ సొంత ప్రయోజనాల కోసం మీ దోపిడీలకు ప్రజలను వారి జీవితాలను బలి చెయ్యొద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ముడిదాన రాంప్రసాద్, కొత్తూరు హరి, వెంకీ, స్వాధీన్ తదితరులు పాల్గొన్నారు.