అరకు ( జనస్వరం ) : నియోజకవర్గం సిరాగం పంచాయతీ తోకవలస గ్రామంలో కొళాయి పాడైపోయింది. తాగడానికి మంచి నీరు లేక బురద గడ్డలో మట్టి తవ్వి నీరు తీసుకెళ్తున్న తోకవలస గ్రామ మహిళలలు. ఈ విషయం జనసేనపార్టీ నాయకుల దృష్టికి రావడంతో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలతో కలిసి గ్రామంలో నుంచి బురద గడ్డవరకు మట్టి తవ్వి నీరు మోస్తున్న మహిళలతో మాట్లాడుతూ వారి సమస్యలు వింటూ ఆ గ్రామ మహిళలతో మాట్లాడుతూ శీతాకాలంలో మంచి నీటి సమస్య ఉందంటే ఎండాకాలంలో చుక్క మంచి నీరు కూడా ఉండదని వాపోయారు. సచివాలయంలో పిర్యాదు చేసిన పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. అధికారులకు, నాయకులకు చెప్పినా ఎవరు స్పందించడం లేదన్నారు. మంచి నీరు కోసం రోజు అరా కిలోమీటరు దూరం వచ్చి తిప్పలు పడుతున్నామన్నారు. ప్రభుత్వ అధికారులు మంచి నీటి కోసం కోట్లు ఖర్చుపెడుతున్నాం అంటున్నారు కానీ నియోజకవర్గంలో మంచి నీటి సమస్య ఉన్న గ్రామాలు చాలా ఉన్నాయి. పల్లెల్లో మంచినీటి సదుపాయం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వఖాళీ బిందెలతో MPDO కార్యాలయం ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన అరకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కొనెడి లక్ష్మణ్ రావు, అరకు వెలి మండల నాయకులు అల్లంగి రామకృష్ణ, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.