
జగ్గయ్యపేట, (జనస్వరం) : భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పట్టణంలోని జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలకు జనసేన పార్టీ తరపున షేక్ షౌకత్ అలీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి వారి త్యాగాలను స్మరించుకుంటూ, స్త్రీలకు ఆమె చేసిన సేవలను కొనియాడుతూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ నాగుల్ మీరా, గోపి, వీరయ్య, హరీష్ తదితరులు పాల్గొన్నారు.