Search
Close this search box.
Search
Close this search box.

ఉద్యమాల అడ్డాగా పేరు గాంచిన శ్రీకాకుళంను కిడ్నీ వ్యాధుల గడ్డగా మార్చిన ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి

ఉద్యమాల అడ్డాగా పేరు గాంచిన శ్రీకాకుళంను కిడ్నీ వ్యాధుల గడ్డగా మార్చిన ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి

      ఇటీవల కాలంలో ఉద్దానం సమస్యకు ప్రభుత్వంచే శాశ్వత పరిష్కారం అని ఒక తెలుగు వార్తా మాధ్యమంలో ఒక వార్త ప్రచురించడం జరిగినది. ఆ పత్రిక పేరు కూడా ఆంధ్ర గొప్పలు గూర్చి చెప్పడానికే పెట్టినట్టు ఉంటుంది. ఆ పత్రిక పేరుకు భిన్నంగా అందులో ప్రచురించే వార్తలు గమ్మత్తుగా ఉంటాయి. ముందుగా అసలు ఉద్దానం గురించి క్లుప్తంగా తెలుసుకుని ఆ పత్రికలో ప్రచురించిన అంశాలను గూర్చి తదుపరి  చర్చించుకుందాం. presstitution అనే పదానికి పర్యాయపదంగా ఆ వార్తా మాధ్యమం ఎలా పని చేసిందో మీరే ఈ తదుపరి విషయాలు చూశాక ఒక అవగాహనకు వస్తారు.

           ఉద్దానం అనగానే ఒకప్పుడు గుర్తుకు వచ్చేవి పచ్చని కొబ్బరి తోటలు, జీడిపప్పు తోటలు, పనస పంటలు, ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ ప్రాంతాన్ని మినీ కేరళ అని కూడా పిలుస్తూ ఉంటారు. కాని కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న సమస్య; 2017 వ సంవత్సరం నుంచి తెలుగు రాష్ట్రాల్లో తరచుగా వినిపిస్తున్న సమస్య – ఉద్దానం నెఫ్రోపతి. నెఫ్రోపతి అనగా చిన్న రక్త నాళాలు లేదా రక్తాన్ని శుభ్రపరిచే మూత్రపిండాలలోని యూనిట్లు దెబ్బతినడం వల్ల ఏర్పడే మూత్రపిండాల వ్యాధి. ఈ వ్యాధి అధిక కాలంగా డయాబెటిస్ ఉండడం చేత కూడా సంభవించే అవకాశం ఉంది. గత రెండు దశాబ్దాలుగా ఈ వ్యాధి అనేక ప్రదేశాలలో బయట పడుతూ వచ్చింది. అమెరికా, బాల్కన్ ఆగ్నేయ యూరప్ ప్రాంతం, బెల్జియం, చైనా, శ్రీలంక, శ్రీకాకుళం. ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో మరియు ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి మండలంలో కూడా ఈ సమస్య ఉన్నదని తేలింది. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నదని గుర్తించిన ప్రాంతాలలో ఒకటి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఏమీ లేకపోయినా కూడా ఈ ప్రాంతంలో నివసించే వారికి నెఫ్రోపతి రావడం సాధారణం అయిపోయింది. ఈ వ్యాధి బారిన పడి గత రెండు దశాబ్దాలుగా సుమారు 20,000 మంది మృత్యువాత పడ్డారని అంచనా. 2019 లో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 15,000 మంది కి పైగా ప్రస్తుతం ఈ వ్యాధి బారిన పడి బాధపడుతున్నారని కనుగొన్నారు. ఈ వ్యాధి సోకడానికి గల కారణాలు తెలుసుకొనడానికి ఇంకా శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తూనే ఉన్నా కూడా గత అనుభవాలతో కొన్ని సాధ్యమైన  కారణాల వలన ఈ పరిస్థితి సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. అవి నీటిలో అధిక స్థాయి సిలికా ఉండడం చేత, దీర్ఘకాలిక నిర్జలీకరణం (dehydration- శరీరం లో కావాల్సిన మోతాదు కంటే తక్కువ మోతాదు లో నీరు లభ్యమవడం/ఉండడం) వలన, నాన్‌స్టెరోయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ వాడకం వలన, జన్యు ఉత్పరివర్తనలు (genetical mutations), అధిక పురుగుమందుల వాడకం వలన, నీటిలో భారీ లోహాలు ఉండుట చేత వచ్చే ఆవాకాశాలు ఎక్కువ.

ఈ సమస్య తీవ్రతను 1993 లో మొదటిసారి తెలుసుకున్న ప్రభుత్వాలు ఈనాటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టాయి అనే దాని గురించి మనం కూలంకషం గా పరిశీలిద్దాం.

                  1993 లో ఈ సమస్య ని గుర్తించిన నాటి నుండి అనేక ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారు. కోట్ల విజయ భాస్కర రెడ్డి గారు, నందమూరి తారక రామారావు  గారు అతి తక్కువ సమయం పాలించిన సంగతి విదితమే. అనంతరం ఆంధ్ర రాష్ట్ర పాలన అంతా కూడా ఇద్దరు ముఖ్యమంత్రుల చేతుల్లోనే ఉంది. నారా చంద్రబాబు నాయుడు మరియు వై యస్ రాజశేఖర రెడ్డి. రాజశేఖర్ రెడ్డి గారి మరణం తరువాత కిరణ్ కుమార్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి గా వ్యవహరించినా ఆయన పాలనలో సంక్షేమ పధకాలకు ఇచ్చిన ప్రాముఖ్యత వేరే విషయాలకు ఇచ్చిన దాఖలా లు లేవు. అయితే 2012 సెప్టెంబర్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాం లో జిల్లాలోని ఉద్దానం ప్రాంతమైన కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం మండలాల ప్రజలను కిడ్నీవ్యాధుల నుండి ఆదుకోవాలని దేశ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు శ్రీకాకుళం ఎంపి కిల్లి కృపారాణి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బృందం అసలు శ్రీకాకుళం జిల్లాలో ఎటువంటి ఇబ్బంది కనుగొనలేదు అని వెల్లడించారు. చాలా ప్రస్ఫుటంగా బాధ పడుతున్న ప్రజలని చూసి అయినా సరే ఒక సాధారణ వ్యక్తి కూడా చెప్పగలిగే పరిస్థితి ఉన్నపుడు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సర్వే చేసిందో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వెల్లడించాల్సిన వాటిని ఎంత నిర్లక్ష్యంగా వదిలేసిందో ఆలోచిస్తే విస్మయానికి గురి చేస్తుంది. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మంచినీటిని అందిస్తే శ్రీకాకుళం లోని సమస్య పరిష్కారం అవుతుంది అని ఆ గొప్ప ఆంధ్ర వారు ప్రచురించారు. అదే మాదిరిగా సాక్స్ మీడియాలో కూడా “యుద్ధ ప్రతిపాదికన శుద్ధి చేసిన తాగునీటిని అందించి వ్యాధికి శాశ్వత విరుగుడును ప్రభుత్వం కనిపెట్టిందని ఉద్దానం కిడ్ని సమస్యకు శాశ్వతంగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు.  మేలైన తాగునీటి పథకాన్ని మందుగా ముందుకు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. 2004 అధికారం తర్వాత వైఎస్సార్ దృష్టి పెట్టినా, ఆయన అకాల మరణంతో సమస్య మొదటికి వచ్చింది.” 

           నిజానికి ఈ వ్యాధిని నివారించడానికి గల ప్రక్రియని రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో మొదలు పెట్టినట్టు దాఖలాలు లేవు. 2004 నుంచి 2009 ఆయన పదవీ కాలంలో ఏ రకమైన చర్యలు తీసుకున్నారో ఆ ఇడుపులపాయకే  ఎరుక. ఆయన మరణం తరువాతనే ICMR తో KGH సహకారం తో పరిశోధనా కార్యక్రమాలు మొదలు పెట్టారు. అయినా కూడా ఆ గొప్ప ఆంధ్ర పత్రికలో వారికి నచ్చిన విధంగా గొప్పలు చెప్పుకొని దుప్పులు కొట్టుకుంటున్నారు. నిజానికి ఈ వ్యాధికి కారణం ఇంకా ఏ శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కలేదు. సమగ్ర పరిశోధన చేసి గాని వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన పూర్తి చర్యలు నిర్ధారించలేరు. ఈ సమస్య పై పరిష్కారాన్ని వెతకడానికి సుమారు పది నుంచి పన్నెండు సంవత్సరాలు వ్యవధి పడుతుంది అని డాక్టర్ లు వెల్లడిస్తున్నారు. జనసేన 2017 లో చేపట్టిన సదస్సులలో డాక్టర్లు అనేక విషయాలు వెల్లడించారు. మినరల్ వాటర్ RO ప్లాంట్ పెట్టి మంచి నీరు అందించినా కూడా అక్కడి ప్రాంతంలో ప్రజలు ఆ రోగం బారిన పడుతున్నారని అక్కడ చికిత్స అందిస్తున్న వైద్యులు సైతం వెల్లడించిన విషయం కూడా అందరికీ విదితమే. అయితే నేలపై పారే నదుల నుంచి సేకరించిన నీటిని పరిశుభ్రం చేసి ప్రజలకు అందించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని, అక్కడి ప్రజలు కేవలం భూగర్భ జలాల మీద ఆధార పడి జీవించాల్సిన పరిస్థితి అని వెల్లడించారు. సర్ఫేస్ నీరు వాడడం చేత కొంత మేరకు ఉపశమనం కలిగే అవకాశం ఉండవచ్చు అని డాక్టర్ లు అభిప్రాయపడ్డారు. డైయాలిసిస్ చేయిస్తే సరిపోతుంది అన్నట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వం తీరును కూడా అక్కడి డాక్టర్ లు తప్పు పట్టడం చూశాం. డైయాలిసిస్ అనేది ఆఖరి దశలో చేయాల్సిన ప్రక్రియ అని, అసలు ముందు నుంచే వ్యాధి ని పసి గట్టడానికి తగు టెస్టులు చేయిస్తే తక్కువ మోతాదులో మందులు వాడి వ్యాధి ని నయం చేసే అవకాశం ఉండవచ్చు అని వారు అభిప్రాయ పడ్డారు.

     ప్రభుత్వం మేఘ అనే సంస్థతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నట్టు, తాగునీటి వ్యవస్థ ను అక్కడ సమకూరుస్తున్నట్టు వెల్లడించారు.  ఇది తాత్కాలికంగా అత్యంత ఉపయోగకరమైన పని అయిననూ ప్రస్తుత ప్రభుత్వం ఆ సమస్య యొక్క మూలాలను కనిపెట్టడానికి చేయవలసిన ప్రయత్నాన్ని పూర్తిగా విస్మరించినట్టు కనిపిస్తుంది. పరిశోధనా విభాగాన్ని మరింత బలపరచి ఆ సమస్య కి గల కారణాల్ని పసిగట్టడానికి కావాల్సిన సదుపాయాలను సమకూర్చకుండా కంటితుడుపు చర్యలకు పరిమితమవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ని నిరూపిస్తుంది. పైగా మేఘ ఇంజనీరింగ్ అనే కంపనీతో ఉన్న సంబంధాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాము. “2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక, టీడీపీ రాజకీయ లబ్ది కోసం ప్రకటనలకే పరిమితం అయ్యారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం సమస్య పరిష్కారానికి ప్రయత్నించలేదు. మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హడావుడి చేసి వదిలేశారే తప్ప పరిష్కారానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. తెలుగుదేశం మిత్ర పక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2017లో ఉద్దానం ప్రాంతాన్ని సందర్శించి ఎంతో హడావుడి చేశారే తప్ప సమస్య పరిష్కారానికి ఏమాత్రం కృషి చేయలేదు. ఆయన 2018 మే లో ఎచ్చెర్ల లో దీక్ష చేసి మరింత హడావుడి చేశారు.” అని కూడా గాలి మాటలు వదిలారు ఆ గొప్ప ఆంధ్ర, సాక్స్ మీడియా వారు. చంద్రబాబు అమరావతి గ్రాఫిక్స్ చుట్టూ విహంగా వీక్షణాలు చేయించిన సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే కోవలో చూపెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన అవి వృధానే అని ఈ కింద పేరాలలో  జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన పనులు ధృఢ నిశ్చయంతో ఆయన వేసిన అడుగులు చూస్తే తెలుస్తుంది.

           పవన్ కళ్యాణ్ గారు మనుషుల్ని కలిపే రాజకీయం కావాలన్నారు. మానవతా కోణంలోనే మాట్లాడుతాను అన్నారు.

             మనుషులు చనిపోతున్నపుడు రాజకీయ లబ్ది పొందాలనుకోవడం దిగజారుడుతానం అని స్పస్టంగా చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ అవసరం అనిపిస్తే ఈ సమస్య పరిష్కారానికి అప్పటి ప్రతిపక్షంతో కూడా కలిసి నడుస్తా అన్నారు. అటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ ని కేవలం ప్రచార ఆర్భాటాలకి హడావిడి చేశారని అనడంలో గొప్ప ఆంధ్ర వారి దూరబుద్దిని చూపిస్తుంది. సరిగా మాట్లాడుకుంటే అసలు ఉద్దానంలో నెఫ్రోపతి అనే కిడ్నీ వ్యాధి గురించి మొత్తం తెలుగు ప్రజలకి తెలియ చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఆర్ధిక వనరులు లేక మూలాన పడిన హార్వర్డ్ యూనివర్సిటీ చేస్తున్న పరిశోధన గూర్చి తెలుసుకుని వారిని కలిసి విశాఖపట్నం, ఉద్దానం ప్రదేశాలలో సమావేశాలు పెట్టించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సమస్య తీవ్రత ను తెలిపిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. జగన్ మోహన్ రెడ్డి గారు కేవలం ప్రజా సంకల్ప యాత్రలో ఒకటి రెండు రోజులు నామమాత్రం పర్యటన చేసి అప్పటి ప్రభుత్వం పై రాజకీయ విమర్శలు చేసి తప్పించుకున్న వ్యక్తి. అయిన కూడా ఆ విష మీడియా సంస్థలు పవన్ కళ్యాణ్ గారిపై విషం కక్కుతూనే ఉంటాయి.

అసలు ఏ ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుందో వివరంగా చూద్దాం. కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి పూర్తి వివరాలు తెలుస్తాయి. 

క్లిక్ చేయండి

ఉద్దానం సమస్యపై జనసేన ప్రయాణం : 

      పవన్ కళ్యాణ్ గారు బాధితుల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకొనుటకు 2017 జనవరిలో స్వయంగా ఆయన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సుమారు 500 మంది నెఫ్రోపతి బాధితులను ఆయన ఇచ్ఛాపురం మణికంఠ థియేటర్ లో కలుసుకుని వాళ్ళ సమస్యలను తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసైనికులు ఉద్దానం కిడ్నీ వ్యాధి గురించి ఒక డాక్యుమెంటరీ తయారు చేసి ప్రపంచానికి ఈ ప్రాంతంలోని సమస్యల గురించి తెలియపరచడానికి చేసిన ప్రయత్నం. ఈ డాక్యుమెంటరీ ద్వారా జనసేన ప్రపంచానికి తెలియ పరచిన విషయాలు. 12 మండలాల్లో కిడ్నీ వ్యాధి ప్రబాలుతున్నట్లు సమాచారం. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటికే సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే సుమారు లక్ష మంది ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వాలు తమను పట్టించుకొకపోవడం వల్లే ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని బాధితులు అంటున్నారు. అక్కడి అమ్మాయిలు అబ్బాయిలను పెళ్లి చేసుకొనుటకు కూడా ఎవరు మొగ్గు చూపడం లేదు అని అక్కడి ప్రజలు వాపోయారు. కనీసం టీచర్లు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా అక్కడికి రావట్లేదాని ఆ ప్రాంతం వాసులు బాధపడ్డారు. రైతు కూలీలు కష్టపడితే కిడ్నీ మీద ఒత్తిడితో కష్టపడకూడదు అంటున్నారని ఒకవేళ ఏదైనా ట్రీట్మెంట్ చేయించడానికి  ఎవరినైనా తీసుకు వెళ్లాలంటే ఇంకొకరు తోడు ఉండాలి. తోడు ఉండాలంటే ఆరోజు కూలి వదులుకుని వెళ్ళాలి. పైగా రాను పోను ఖర్చులు 2000 వరకు అవ్వడం చేత ఇబ్బందులు పడుతున్నారని వ్యక్తం చేశారు. పైగా ఆసుపత్రి వారు ఏ రోజు రమ్మంటారో ఏ రోజు డయాలసిస్ చేయించుకోమంటారో తెలియదు అని వ్యక్తం చేశారు. ఈ వ్యాధి ప్రబలడం చేత అక్కడి ప్రజలు బాంబే గోవా లాంటి పట్టణాలకి వలస వెళ్లిపోతున్నారని వెల్లడించారు. 2017 జనవరి మొదలుకుని 26 మే 2018 నాటికి అనేక మార్లు అనేక సభలలో అప్పటి ప్రభుత్వాన్ని ఉద్దానం సమస్య మీద దృష్టి పెట్టమని కోరడం, హెచ్చరించడం జరిగినది. అయిన కూడా ప్రభుత్వం నుంచి సరియైన స్పందన లేకపోవడం చేత ప్రకటనల్లో చెప్పిన వాటికి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులకి పొంతన లేనందున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. 

దీక్ష సందర్భంగా ఆయన పోరాట యాత్ర మధ్యలో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తూ చేసిన కొన్ని డిమాండ్ లను కింద పొందుపరచడం జరిగినది. 

  • ఉద్దానంలోని అన్ని గ్రామాల్లోనూ మొబైల్ స్క్రీనింగ్ కేంద్రాల ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించాలి.
  • ప్రతి డయాలిసిస్ కేంద్రంలో కిడ్నీ వ్యాధులకు సంబంధించి శిక్షణ పొందిన ( రీనల్ ) పారా మెడికల్ సిబ్బందిని నియమించాలి. వారానికి ఒకసారి డయాలిసిస్ కేంద్రానికి నెఫ్రోలోగీశత వెళ్ళి వైద్యం అందించాలి.
  • ఉద్దానంలోని అన్ని గ్రామాల్లోనూ మొబైలు స్క్రీనింగ్ కేంద్రాల ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించాలి.
  • డయాలిసిస్ కేంద్రాల సంఖ్య పెంచాలి. ఈ కేంద్రాలకి అనుబంధంగా బ్లడ్ బ్యాంక్ లు ఏర్పాటు చేయాలి.
  • కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులను సక్రమంగా ఉచితంగా అందించాలి. కొన్ని మాత్రమే ఉన్నాయి. మిగిలినవి బయట కొనుక్కోండి అనే సమాధానం రాకూడదు.
  • డయాలిసిస్ చేయించుకొంటున్న వారు.. ఆ స్టేజ్ కు చేరిన వారి వివరాలు పక్కాగా నమోదు చేయాలి. ఫించను మిగుల్చుకొనే కక్కుర్తి లెక్కలు కట్టిపెట్టాలి.
  • డయాలిసిస్ చేయించుకొనేవారికీ, అన్నీ స్టేజీల్లో ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకీ ఫించను అందించాలి.
  • కిడ్నీ వ్యాధితో బాధపడేవారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి.
  • శుద్ధి చేసిన రక్షిత తాగు నీటిని గడపగడపకీ సరఫరా చేయాలి. అందుకు సంబంధించిన శుద్ధి ప్లాంట్లు పనులు వెంటనే పూర్తి చేయాలి.
  • ఉద్దానంలో ఈ వ్యాధి ప్రబలడానికి మూలాలను అన్వేషించే పరిశోధన కేంద్రం తక్షణమే ఏర్పాటు కావాలి.
  • శ్రీలంకలో ఆ దేశ అధ్యక్షుడికి స్వయంగా అక్కడి కిడ్నీ వ్యాధుల ప్రభావిత ప్రాంతానికి సంబంధించిన సమస్యను పర్యవేక్షిస్తారు. అదే విధంగా మన రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి స్వయంగా ఉద్దానం కిడ్నీ సమస్య నివారణకు చేపట్టే చర్యల్ని పర్యవేక్షించాలి. ఇందుకు స్పెషల్ యాక్షన్ టీం ఏర్పాటు చేయాలి.
  • రాష్ట్రానికి తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని నియమించాలి.
  • ఉద్దానం ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.
  • కేంద్ర ప్రభుత్వం ఉద్దానం సమస్య తన పరిధిలోనిది కాదు అని తప్పించుకోకూడదు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ అంశంపై దృష్టిపెట్టి రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొంటూ తగిన సహాయసహాకారాలు ఇవ్వాలి.
  • శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి ఎమ్మెల్యే ఎంపీ కిడ్నీ రోగుల్నీ దత్తత తీసుకుని వారికి తగిన వైద్యం అందుతుందో లేదో ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి.
  • కార్పొరేట్ సంస్థలు సీ.ఎస్.ఆర్ లో భాగంగా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకి అవసరమైన సేవాకార్యక్రమాలు చేయాలి.
  • ప్రతి కార్పొరేట్ ఆసుపత్రి విధిగా తమ వైద్య సిబ్బందిని, తమ దగ్గర ఉన్న నెఫ్రోలోగీశతలని ఈ ప్రాంతానికి ఎప్పటికప్పుడు పంపించి ఉచితంగా వైద్య సేవలు అందించాలి.
  • ఉద్దానం ప్రాంతంలోని ప్రతి ఒక్కరికీ సశాస్త్రీయంగా పరీక్షలు నిర్వహించాలి. వ్యాధి తొలి దశలో ఉన్న వారిని తక్షణం గుర్తించి మందులు ఉచితంగా ఇవ్వాలి.
  • శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధులకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ ఆశుపత్రి ప్రారంభించాలి.
  • శ్రీకాకుళం రిమ్స్ లో తక్షణమే నెఫ్రాలజిస్టును నియమించాలి.

అసలు ఏ పార్టీ ఎంత కృషి చేసింది అనేది ప్రజలకు తెలియపరచడం కోసం మేము ఈ ప్రయత్నం చేశాం.

        ప్రజా సంకల్ప యాత్ర పేరు తో జగన్ రెడ్డి గారు ఉద్దానం ప్రాంతానికి వెళ్ళి కూడా అక్కడ పూర్తిగా అవగాహన కలిగించుకోకుండా తూతూ మంత్రంగా కొన్ని మాటలు మాట్లాడి రాజకీయ కోణంలో ప్రసంగాలు చేసుకుని వెళ్లిపోయారు. సరిగా గమనిస్తే ఆయన అసలు ఉద్దానం గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు కూడా పదవిలో ఉన్నంత కాలం కనీసం ఒక నెఫ్రోలజిస్ట్ ని కూడా పెట్టలేక పోయారు. ఒక రీసెర్చ్ సెంటర్ ని స్థాపించలేకపోయారు. అయిన ప్రజలు – “గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది” అన్న చందాన వీరిరువురికే వారి విలువైన ఓటును వేసుకొని మోసపోయారు. ఇప్పుడు జగన్ రెడ్డి గారు చేస్తున్న నీటి ప్రాజెక్టు కూడా వారి వారి సంస్థలకు పని కలిపించుకొనుట కొరకే తప్ప నిజంగా చిత్తశుద్ధితో ఉద్దానం సమస్య పరిష్కరించాలనే ఆలోచన అయితే కాదు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా పవన్ కళ్యాణ్ లాగా హడావిడి చేయకుండా శ్రీకాకుళం ఉద్దానం సమస్య పరిష్కరించిన జగన్ అని వేసుకున్న న్యూస్, చేసుకున్న ప్రచారం వెనుక దాగి ఉన్న సత్యం – జగన్ ప్రతిపక్షం లో ఉన్నపుడు ఉద్దానంపై నిజమైన కృషి చేయలేదు. ఆయన తండ్రి గారు అయిన రాజశేఖర రెడ్డి కూడా చేయలేదు కాబట్టే. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ ఉద్దానం సమస్య వెళ్ళిన వెంటనే ఆయన సామాన్య ప్రజలు పడుతున్న బాధలు వేదనలు తొలగించడానికి ఆయన పరిమితిలో ఉన్న అన్నీ విధాలా ప్రయత్నాలు చేశారు. రాజకీయ కోణంలో చూస్తూ టీడీపీ చంద్రబాబు గారు, అప్పటి ప్రతిపక్ష నేత జగన్ రెడ్డి గారు ఈ సమస్యని అత్యంత సులభంగా తీసుకున్నారు. ఎవరు నిజాయితీ పరులో స్వలాభం కోసం ఆలోచించకుండా పని చేసే నాయకులు ఎవరో తెలుసుకొనండి ప్రజలారా..!

by

Barbaarik 

Twitter ID : @Barbaarik 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
భారతీయం
భారతీయం - వైదిక సంప్రదాయం
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way