
విశాఖపట్నం, (జనస్వరం) : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ కార్యాలయం నగర మేయర్ శ్రీమతి శ్రీ గొల్లగాని హరి వెంకటకుమారి, జనసేన పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికీ అతిథులుగా రాష్ట్ర పి.ఎ.సి సభ్యులు, గాజువాక నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ కోన తాతారావు, డిప్యూటీ మేయర్లు, భీమిలి నియోజకవర్గ ఇంఛార్జ్ పంచకర్ల సందీప్, అనకాపల్లి ఇంచార్జీ “పరుచూరి భాస్కరరావు విచ్చే సారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులు ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియామకమైన శ్రీమతి భీశెట్టి. వసంతి లక్ష్మిని, శ్రీ దల్లీ గోవింద్ రెడ్డిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరింత ఉన్నతమైన పదవులు అలంకరించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వన్నెంరెడ్డి సతీష్ కుమార్, శివప్రసార్ రెడ్డి, పిల్ల రామకృష్ణ, అంగ ప్రశాంతి, మోగ శ్రీనివాసరావు, ఏరిపిల్లి నూకరాజు, తెలుగు అర్జున, తెలుగు లక్ష్మీ, గుంటూరు మూర్తి, కరణం కళావతి, లక్ష్మీ, సురేష్, జనసేన వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.