
విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లాలో మిమ్స్ హాస్పిటల్ నుండి తొలగించిన ఉద్యోగస్తులను విధుల్లోకి తీసుకోవాలని, CITU ఆధ్వర్యంలో మిమ్స్ (హాస్పిటల్) ఎంప్లాయిస్ యూనియన్ & వర్కర్స్ యూనియన్ చేస్తున్న దీక్షకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో పాటు జనసేన పార్టీ కూడా మద్దతు తెలిపింది. నెలిమర్ల, గరివిడి, విజయనగరం నుండి అధిక సంఖ్యలో జనసేన పార్టీ నుండి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేనపార్టీ నాయకులు శ్రీ దంతులూరి రామచంద్ర రాజు, త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ… మిమ్స్ యాజమాన్యం తొలగించింది పదిహేనుమందైనా వారి వెనుకనున్న కుటుంబాలు దృష్టిలో ఉంచుకొని వారి పొట్టమీద కొట్టకుండా వారికి న్యాయం జరిగేలా చూడాలని, అలాగే స్థానిక నెలిమేర్ల శాసనీసభ్యులు శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు కూడా చొరవతీసుకొని బాధితులకు మళ్ళీ యాజమాన్యం విధుల్లోకి తీసుకొనేటట్లు చేయాలని కోరారు. అలాగే వారికి న్యాయం జరిగే వరకు CITU, మిమ్స్ వర్కర్స్ యూనియన్ చేసే పోరాటంలో జనసేనపార్టీ తప్పకుండా భాగస్వామ్యం అవుతుందని అన్నారు.