తణుకు, (జనస్వరం) : తణుకు నియోజకవర్గంలో జరిగిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సభ కారణంగా అనుక్షణం ప్రజల సమస్యలపై పోరాటం చేసే తణుకు జనసేన పార్టీ నాయకులు అనుకుల రమేష్ ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి తణుకు నుంచి పెనుగొండ తీసుకు వెళ్ళి అక్కడ నిర్బందించటం ద్వారా భారత రాజ్యంగం ద్వారా సంక్రమించిన హక్కుల హరించటమేనని ఆయన తెలియజేశారు. అలాగే తణుకు పట్టణం మొత్తం దిగ్బందించటం, ప్రజల జీవిన విధానాన్ని ఇబ్బందులు కలిగించటం తగదని జనసేన పార్టీ నాయకులు అనుకుల రమేష్ అన్నారు. అక్రమ అరెస్టు లకు తణుకు నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు ఎవ్వరూ బయపడరని రమేష్ తెలియజేశారు. వైకాప ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.