ఒంగోలు (జనస్వరం) : ఒంగోలు నియోజకవర్గంలోని ముక్తినూతల పాడు గ్రామంలోని sc కాలనీలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి రాయపాటి అరుణ గారి అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. జనసేన పార్టీ తరుపున రెండు చర్చిలకి 80కుర్చీలు బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరు అయిన జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ జనసేనపార్టీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరగడం ఆనందంగా ఉందన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలలో మతాల ప్రస్తావన లేని రాజకీయం గురించి వివరిస్తూ మనందరం కలసి కట్టుగా ఉండాలని సూచించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇవాళ ఈ కార్యక్రమానికి ముస్లిం అయిన రియాజ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మరింత శోభాయానంగా మారిందని, జనసేనపార్టీలో మతాల బేధన ఉండదని చాటి చెప్పారన్నారు. యేసు క్రీస్తు ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, కరోనా నుంచి కోలుకున్నాక ఈ ఒమిక్రాన్ వైరస్ నుండి రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాదు గారు, ఒంగోలు జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ గారు,ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు గారు, ముత్యాల కళ్యాణ్ గారు, రాయని రమేష్ గారు, మరియు జనసేన నాయకులు పిల్లి రాజేష్ గారు, సుబ్బారావు మేడిశెట్టి గారు, పోకల నరేంద్ర గారు, మాల్యాద్రి నాయుడు గారు, షేక్ సుభాని గారు, బ్రహ్మ నాయుడు గారు, వీరమహిళలు ప్రమీల గారు, ఆకుపాటి ఉష గారు, నూకల శివపార్వతి గారు పాల్గొన్నారు.